చరణ్ అప్పుడెప్పుడో కొట్టడం మొదలుపెట్టి ఇంకా ఆపలేదు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార ఇమేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సినిమా ఒక యావరేజ్ అయినా తన స్టార్ పవర్ తో దానిని హిట్ చేయగల సత్తా ఆయనకుంది. కెరీర్లోని రెండవ చిత్రం ‘మగధీర’తోనే 100 కోట్లు కొల్లగొట్టియు రికార్డులు క్రియేట్ చేసిన ట్రాక్ రికార్డ్ చరణ్ సొంతం. ప్రస్తుతం ఆయన ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఈ చిత్రంలో […]

Written By: admin, Updated On : October 31, 2020 7:55 pm
Follow us on


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార ఇమేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సినిమా ఒక యావరేజ్ అయినా తన స్టార్ పవర్ తో దానిని హిట్ చేయగల సత్తా ఆయనకుంది. కెరీర్లోని రెండవ చిత్రం ‘మగధీర’తోనే 100 కోట్లు కొల్లగొట్టియు రికార్డులు క్రియేట్ చేసిన ట్రాక్ రికార్డ్ చరణ్ సొంతం. ప్రస్తుతం ఆయన ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

ఈ పాత్ర తాలూకు టీజర్ ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైంది. విపరీతమైన అంచనాలు నడుమ రిలీజైన ఈ టీజర్ ప్రేక్షకులను, అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు వరుసపెట్టి యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే మోస్ట్ వ్యూడ్ టాలీవుడ్ టీజర్ అనే రికార్డును సొంతం చేసుకున్న ఈ టీజర్ ఇప్పుడు ఇంకో సరికొత్త క్రెడిట్ సాధించింది. ఇప్పటివరకు ఈ టీజర్ 33. 3 మిలియన్ల వ్యూస్ రాబట్టుకుంది. దీంతో దక్షిణాదిలో అత్యంత ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న టీజర్ గా నిలిచింది.

Also Read: మూడేళ్ళ వయసులోనే లైంగిక దాడికి గురయ్యానంటున్న హీరోయిన్

ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ నుండి విడుదలైన రామరాజు ఫర్ భీమ్ టీజర్ తప్ప వేరే ఏ టీజర్ కూడ చరణ్ టీజర్ కు దరిదాపుల్లో కూడ లేవు. లైక్స్ పరంగా చూసుకున్నా ఈ కూడ 8 లక్షల పైచిలుకు లైక్స్ సాధించింది చరణ్ టీజర్. ఈ రికార్డులు చూసిన అభిమానులు కేవలం టీజర్ తోనే ఇంత భీభత్సం సృష్టించిన చరణ్ ట్రైలర్ విడుదలైతే ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతాడో అంటూ ముచ్చటపడిపోతున్నారు. ఇకపోతే సుమారు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ లాంటి ఇతర అన్ని ముఖ్యమైన భాషల్లోనూ ఈ చిత్రం విడుదలకానుంది.