స్టార్ హీరోల మీద అభిమానులు పెట్టుకునే అంచనాలు అలా ఇలా ఉండవు. ఒక్కోసారి ఆ అంచనాలను అందుకోవడం ఆ స్టార్ హీరోల వలన కూడ కాదు. అలాంటి అంచనాల్లో సీనియర్ స్టార్ హీరోలను రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఒత్తిడి చేయడం ఒకటి. వాళ్ళ ఒత్తిడి కారణంగా ఇష్టం లేకున్నా రాజకీయాల్లోకి దిగేవారు కొందరైతే ఇష్టపడి వచ్చేవాళ్ళు ఇంకొందరు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ మూడవ రకం. ఆయనకు రాజకీయ పట్ల ఎప్పుడూ సగం మనసే ఉండేది. చాలా ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి రావాలని రజినీ మీద ఒత్తిడి తెచ్చారు ఆయన ఫ్యాన్స్.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
కానీ ఆ సమయంలో తమిళ రాజకీయాల్లో జయలలిత, కరుణానిధి చాలా బలమైన నాయకులుగా ఉండటం వలన రజినీ అభిమానుల కోరికను పక్కపెడుతూ వచ్చారు. కానీ ఇటీవల అనారోగ్యంతో జయలలిత ఆ తర్వాత వయసు రీత్యా కరుణానిధి మరణించడం జరిగింది. అప్పుడు రజినీ మీద ఒత్తిడి మరింత ఎక్కువైంది. రాజకీయ రంగప్రవేశం మీద ఎప్పటిలానే మీమాంసలోనే ఉన్న ఆయన జయలలిత, కరుణానిధి లేరు కాబట్టి ఇదే రైట్ టైమ్ అనుకుని అభిమానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
Also Read: పవన్ కల్యాణ్ సినిమాకు కొత్త సమస్య..!
కానీ పార్టీని సంస్థాగతంగా ఏర్పాటు చేయడంలో, ప్రజల్లోకి వెళ్లడంలో మాత్రం ఆలస్యం చేశారు. వచ్చే సంవత్సరం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలనేది రజినీ ముందు నుండి పెట్టుకున్న లక్ష్యం. అందుకే గత ఏడాది మొత్తం సినిమాలు చేస్తూ గడిపిన ఆయన 2020 అంటే ఈ సంవత్సరం జనంలోకి వెళ్లాలని అనుకున్నారు. కానీ కోవిడ్ మహమ్మారి పంజా విసరడంతో ఆయన ఆలోచన తలకిందులైంది. సభలు, సమావేశాలు కాదు కదా ఆరోగ్యం దృష్ట్యా ఆయనసలు బయటకు కూడ రాలేని పరిస్థితి.
Also Read: మహేష్ బాబు ‘సర్కార్ వారి పాట’పై కొత్త అప్డేట్..
అందుకే ఈసారి ఎన్నికలకు కూడ దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. ఇంకా అదికారిక ప్రకటన రాలేదు కానీ అదే ఫైనల్ అని అంతా అంటున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా రజినీని ప్రత్యక్ష ఎన్నికల్లో, ముఖ్యమంత్రి పీఠం మీద చూడాలని కలలుకన్న అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అంతే.. నేరుగా రజినీ ఇంటి ముందుకు వెళ్లి ధర్నాలు చేస్తూ ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. కానీ రజినీది కూడ క్లిష్టమైన పరిస్థితే. ఆరోగ్యం దెబ్బతింటే మొదటికే మోసం వస్తుందనేది ఆయన బాధ. అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నారు.