కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం అమలు దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రం ఇప్పటికే పలు ప్రభుత్వ పథకాల అమలుకు ఆధార్ ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. బ్యాంక్ అకౌంట్ కు కూడా ఆధార్ ను లింక్ చేసుకుంటే మాత్రమే ఇబ్బందులు పడకుండా బ్యాంక్ లావాదేవీలను నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే ఇకపై ఓటర్ కార్డుకు కూడా ఆధార్ ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి.
Also Read: ఎమ్మెల్సీ కౌంటింగ్: టీఆర్ఎస్ అభ్యర్థులదే ఆధిక్యం
ఓటు హక్కు ఉన్నవాళ్లలో కొంతమంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు వేస్తూ ఓటు హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. ఈ విధంగా ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా కేంద్రం ఓటర్ కార్డును ఆధార్ అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకునేలా నిబంధనలలో మార్పులు చేస్తోంది. ఓటర్ ఐడీ డూప్లికేషన్ కాకుండా ఉండటానికి కేంద్రం ఈ నిబంధనలను అమలులోకి తెస్తోంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read: ఏపీ ఎమ్మెల్సీ విజేతలు వీరే: తెలంగాణ అప్డేట్ ఏంటంటే?
చట్టాలకు సవరణలు చేసి కేంద్రం ఆధార్-ఓటర్ ఐడీ లింక్ ను అమలులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఆధార్ తో లింక్ చేసుకోకపోయినా ఓటర్ కార్డ్ చెల్లుబాటు అవుతుంది. అయితే కేంద్రం నిబంధనలు అమలులోకి తెస్తే మాత్రం ఆధార్ తో లింక్ చేసుకోని పక్షంలో ఓటర్ ఐడీ పని చేయదు. 2020 సంవత్సరం జనవరి నెలలో ఎన్నికల కమిషన్ కేంద్రానికి ఇదే అంశంపై అభ్యర్థన చేసింది.
మరిన్ని వార్తల కోసం: అత్యంత ప్రజాదరణ (ట్రెండింగ్)
కేంద్రం ఆ సమయంలో ఆధార్ – ఓటర్ కార్డు లింకింగ్‌పై భద్రతాపరమైన అంశాలను పరిశీలించాలని పేర్కొంది. గతంలోనే ఆధార్ ఓటర్ ఐడీ లింక్ కు సంబంధించిన ప్రతిపాదన వెలువడగా సుప్రీం కోర్టులో ఆధార్ ఓటర్ లింక్ ను సవాలు చేస్తూ ఒక పిటిషన్ దాఖలైంది.