అసలు కథ ముందుంది.. మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండమేనా?

జగన్ ప్రభుత్వానికి ‘అసలు కథ ముందుంది’ అని అంటున్నాయి కొందరు రాజకీయ విశ్లేషకులు.. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రప్రభుత్వంపై ప్రజల విశ్వాసం ఏవిధంగా ఉన్నదనేది తేలుతుందని అంటున్నారు. రెండేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ కాలంలో ఆ ప్రభుత్వం చేసిన.. చేపట్టిన పథకాలను ప్రజలు ఆదరిస్తారా..? లేక ఛీ కొడుతారా..? అనేది తేలుతుందంటున్నారు టీడీపీ, ఇతర పార్టీల నాయకులు.. అయితే ఈ ఎన్నికల్లో జగన్ అధిక మెజారిటీ స్థానాలు దక్కించుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల […]

Written By: NARESH, Updated On : February 22, 2021 10:57 am
Follow us on

జగన్ ప్రభుత్వానికి ‘అసలు కథ ముందుంది’ అని అంటున్నాయి కొందరు రాజకీయ విశ్లేషకులు.. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రప్రభుత్వంపై ప్రజల విశ్వాసం ఏవిధంగా ఉన్నదనేది తేలుతుందని అంటున్నారు. రెండేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ కాలంలో ఆ ప్రభుత్వం చేసిన.. చేపట్టిన పథకాలను ప్రజలు ఆదరిస్తారా..? లేక ఛీ కొడుతారా..? అనేది తేలుతుందంటున్నారు టీడీపీ, ఇతర పార్టీల నాయకులు.. అయితే ఈ ఎన్నికల్లో జగన్ అధిక మెజారిటీ స్థానాలు దక్కించుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రభుత్వానికి ఢోకా లేదని వారు పేర్కొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్లో నిన్నటి వరకు పంచాయతీ ఎన్నికల కోలాహాలం సాగింది. ఇక మున్సిపల్ పోరు జరగనుంది. పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికలు భిన్నమైనవి. పంచాయతీ ఎలక్షన్స్లో పార్టీలు పరోక్షంగా పాల్గొంటే మున్సిపల్, కార్పొరేషన్ ప్రక్రియలో మాత్రం ప్రత్యక్షంగా పార్టీల మధ్యే యుద్ధం జరుగనుంది. మార్చి 2 నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు కానున్నందున అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు ఇందులో తాము పైచేయి సాధించడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పటి వరకు రాష్ట్రంలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేయించారు. ఈ నిర్ణయంతో ఇప్పటి వరకు రాజధానిగా ఉన్న గుంటూరు, విజయవాడ ప్రాంతంలోని ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారని అంటున్నారు. అయితే మూడు రాజధానుల విషయంలో తీర్మానం వరకే చేసిన జగన్ ఆ తరువాత ఎలాంటి అడుగు ముందుకేయలేదు. ఈ నేపథ్యంలో విశాఖ, కర్నూలు ప్రజలు..మూడు రాజధానుల విషయంలో జగన్ వెనుకడుగు వేస్తున్నారా..? అనే సందేహంలో ఉన్నారు. దీంతో ఈ జిల్లాల్లోని కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి తీర్పునిస్తారోనన్న ఆసక్తి నెలకొంది.

సీఎంగా పదవీకాలం చేపట్టిన జగన్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అయితే అవి సగటు పేదవారికి చేరాయా..? లేదా..? అన్నది సందేహమే. ఈ విషయంలో ప్రతిపక్షాలు నిలదీస్తే వారిపై బూతులు వాడడంతో ప్రజలు వైసీపీలోని కొందరి నాయకులపై తీవ్ర అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేతల తీరుతో ప్రభుత్వానికి కూడా మచ్చ ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచించని కొందరు నాయకులు ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకోవడంతో విద్యావంతులు, ఇతర వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి గట్టి నిర్ణయం తీసుకోవడం లేదు. తప్పంతా బీజేపీదేనని అంటున్న జగన్ రాష్ర్ట ప్రజలకు విశాఖ ఉక్కు అవసరమని ఏవిధంగానూ తెలియజేయడం లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని సర్దిపెట్టుకోవడంతే ప్రభుత్వం సరిపెట్టిందని.. ఈ విషయంలో కేంద్రప్రభుత్వంపై జగన్ ఎందుకు పోరాడడం లేదని అంటున్నారు. దీంతో విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగే స్టీల్ ప్లాంట్ ప్రభావం ఉంటుందని అంటున్నారు.

ఇలా పలు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా ఎదుర్కుంటందోనని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలో 85 శాతం ప్రజలు ప్రభుత్వంపైపే ఉన్నారని.. త్వరలో జరిగే ఎన్నికల్లోనూ అంతే విశ్వాసం ఉంటుందని భావిస్తోంది. అయితే ఈ రెండు ఎన్నికల్లో చాలా తేడాలున్నాయని.. ఇవే ప్రభుత్వాన్ని విశ్వసించే ఎన్నికలని అంటున్నారు. మరి ఇక్కడ వైసీపీ ఏ విధంగా స్ట్రాటజీ కాపాడుకుంటుందో చూడాలి.