కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలోని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ లలో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. 18 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఎవరైనా అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో సులభంగా చేరవచ్చు. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం వల్ల 60 సంవత్సరాల తర్వాత డబ్బులు పొందవచ్చు.
Also Read: ఇల్లు లేని వారికి కేంద్రం బంపర్ ఆఫర్.. హోమ్ లోన్ తీసుకుంటే రూ.2.67 లక్షలు తగ్గింపు..?
18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేస్తే ప్రతి నెలా బ్యాంక్ అకౌంట్ నుంచి కొంత మొత్తం కట్ అవుతాయి. ఈ స్కీమ్ లో చేరాలని భావించే వాళ్లు 42 రూపాయల నుంచి 1454 రూపాయల వరకు ఎంతమొత్తమైనా చెల్లింవచ్చు. ఈ స్కీమ్ లో చేరాలనుకునే వాళ్లు పోస్టాఫీస్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి సులభంగా ఈ స్కీమ్ లో చేరవచ్చు.
Also Read: ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఇంటి నుంచే డబ్బులు వేసే, తీసే ఛాన్స్..?
మీరు ఎంత మొత్తం చెల్లిస్తే చెల్లించిన మొత్తం ఆధారంగా 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ వస్తుంది. 18 సంవత్సరాల వయస్సులో ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ప్రతి నెలా 210 రూపాయలు కడితే 60 ఏళ్ల తర్వాత 5,000 రూపాయలు వస్తాయి. 40 సంవత్సరాల వ్యక్తి 5,000 రూపాయల పెన్షన్ పొందాలని అనుకుంటే మాత్రం నెలకు 1,454 రూపాయలు చెల్లించి సులభంగా ఈ స్కీమ్ లో చేరవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
సమీపంలోని పోస్టాఫీస్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను పొందవచ్చు. వృద్ధాప్య దశలో ఎవరిపై ఆధారపడకుండా ఆదాయం పొందే అవకాశాన్ని ఈ స్కీమ్ కల్పిస్తోంది. తక్కువ మొత్తం చెల్లించి ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉండటంతో చాలామంది ఈ స్కీమ్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.