సొట్టలబుగ్గల సుందరి తాప్సీ టాలీవుడ్ ద్వారా సినిమా రంగానికి పరిచయమైంది. ఢిల్లీకి చెందిన ఈ భామ మోడలింగ్ లో రాణిస్తుండనే టాలీవుడ్లో ఆమెకు సినిమా అవకాశం దక్కింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఝమ్మందినాదం’ మూవీలో నటించింది. తొలి సినిమాతోనే తాప్సీ గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
Also Read: మహేష్ ను ఇలా చూసి తట్టుకోగలమా?
తాప్సీ ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ బీజీగా ఉంది. తాప్సీ తెలుగులో నటించిన ‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’.. ‘సాహసం’ మూవీలు సూపర్ హిట్టుగా నిలిచాయి. తాప్సీ సౌత్ ఇండస్ట్రీలో బీజీగా ఉండగానే ఆమెకు బాలీవుడ్ అవకాశాలు దక్కాయి. హిందీలో ఆమె నటించిన ‘పింక్’ మూవీ సూపర్ హిట్టవడంతో ఆమెకు బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి.
‘పింక్’లో తాప్సీ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తాప్సీలోని అసలైన నటన ‘పింక్’ ద్వారా బయటికి వచ్చింది. దీంతో ఆమె లేడి ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా నిలుస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ కష్టాలపై మాట్లాడుతూ ఓ హీరో భార్యపై సంచలన కామెంట్స్ చేసింది.
Also Read: ‘క్రాక్’తో సీరియస్ అయిన రవితేజ !
తాను ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు సదరు హీరో భార్యకు నేను నచ్చలేదట. దీంతో చెప్పపెట్టకుండా తీశారని చెప్పింది. ఓసారి తనతో డబ్బింగ్ చెప్పించి గొంతు బాగోలేదని వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించారని.. కనీసం ఆ విషయం తనతో చెప్పలేదని వాపోయింది. అలాగే కెరీర్ తొలినాళ్లలో ఒకట్రెండు సినిమాలు ప్లాప్ కావడంతో తనపై ఐరన్ లెగ్ ముద్ర వేసినట్లు చెప్పింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
మరోసారి మీ హీరోకు హిట్టులేదు.. కాబట్టి నువ్వు కూడా పారితోషికం తగ్గించుకోవాలని సూచించారని తెలిపింది. అయితే హీరోకు హిట్టులేకపోతే తానేందుకు పారితోషికం తగ్గించుకోవాలో అర్థం కాలేదని తెలిపింది. ఇండస్ట్రీలోని ప్రతీ హీరోయిన్ ఇలాంటి అవమానాలను ఎదుర్కొంటుందని తెలిపింది. ఇక హీరో భార్యపై ఆరోపణలు చేసిన తాప్సీ మాత్రం ఆమె ఎవరో చెప్పకపోవడం గమనార్హం.