మేయర్ పీఠం.. ఎవరూ నోరెత్తకుండా..  కేసీఆర్ పక్కా ప్లాన్

ప్రస్తుత రాజకీయాల్లో అపర చాణక్యుడు అని కేసీఆర్ నిరూపించుకున్నారు. ఆయన రాజకీయ వ్యూహాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా చిత్తు అయ్యింది. తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో కేసీఆర్ చూపించిన చాణక్యతకు ప్రతిపక్ష బీజేపీ నేతల నోట మాట రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇక కొద్దిరోజులుగా జరుగుతున్న బీసీ నినాదానికి కేసీఆర్ ఈ దెబ్బతో చెక్ పెట్టారు. ఓసీ రిజర్వేషన్ వచ్చినా కూడా బలమైన సామాజికివర్గానికి చెందిన బీసీ అయిన విజయలక్ష్మీకి మేయర్ పీఠం కట్టబెట్టారు. […]

Written By: NARESH, Updated On : February 12, 2021 9:01 am
Follow us on

ప్రస్తుత రాజకీయాల్లో అపర చాణక్యుడు అని కేసీఆర్ నిరూపించుకున్నారు. ఆయన రాజకీయ వ్యూహాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా చిత్తు అయ్యింది. తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో కేసీఆర్ చూపించిన చాణక్యతకు ప్రతిపక్ష బీజేపీ నేతల నోట మాట రాలేదంటే అర్థం చేసుకోవచ్చు.

ఇక కొద్దిరోజులుగా జరుగుతున్న బీసీ నినాదానికి కేసీఆర్ ఈ దెబ్బతో చెక్ పెట్టారు. ఓసీ రిజర్వేషన్ వచ్చినా కూడా బలమైన సామాజికివర్గానికి చెందిన బీసీ అయిన విజయలక్ష్మీకి మేయర్ పీఠం కట్టబెట్టారు. ఇక తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డిలకు డిప్యూటీ మేయర్ ఇచ్చాడు. ఉద్యమకారుడు మోతె శోభన్ రెడ్డి భార్య శ్రీలతరెడ్డికి ఈ పదవి ఇవ్వడం ద్వారా ఉద్యమకారులను కేసీఆర్ సంతృప్తి పరిచాడు.

ఎవ్వరూ ఊహించని విధంగా మేయర్, డిప్యూటీ మేయర్ లకు పోటీలోకి దిగిన ఎంఐఎం చివరి నిమిషంలో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడాన్ని బట్టి చూస్తే కేసీఆర్ ఎంత పక్కాగా ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ముందే వ్యూహాత్మకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో దీనిపై చర్చించారని సమాచారం.

తెలంగాణలో బీజేపీ బలపడితే అది టీఆర్ఎస్ కంటే కూడా ఎంఐఎంకు దెబ్బ. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీజేపీ నేతలు ఏకంగా పాతబస్తీపై దండయాత్ర చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు తాము గెలిస్తే పాతబస్తీలో ఎంఐఎంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ హెచ్చరించారు.

ఇక జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని గనుక టీఆర్ఎస్, ఎంఐఎం కనుక వదులుకుంటే బీజేపీ వశమైతే నగరంలో ఈ రెండు పార్టీల పట్టు తగ్గి.. ప్రాభవం కోల్పోవడం ఖాయమని అనుకున్నారు. అందుకే పూర్తి బలం లేకున్నా.. డిప్యూటీ మేయర్ పదవి వచ్చే అవకాశం ఉన్నా కూడా ఎంఐఎం కేవలం బీజేపీని కట్టడి చేయడానికే టీఆర్ఎస్ కు ఇక్కడ మద్దతునిచ్చిందని చెప్పొచ్చు.

ఇందులో ప్రధానంగా కేసీఆర్ వ్యూహాలు పనిచేశాయంటున్నారు. మేయర్ ఎన్నిక సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ‘టీఆర్ఎస్ మాకు డిప్యూటీ మేయర్ ను ఇవ్వడానికి ముందుకు వచ్చినా తాము అంగీకరించలేదని పేర్కొన్నారు. దీనికి ప్రతిగా కేసీఆర్ ఎంఐఎంకు ఒక ఎమ్మెల్సీ పదవిని ఇచ్చేందుకు అంగీకరించారని సమాచారం.

ప్రధానంగా టీఆర్ఎస్ , ఎంఐఎం కలిస్తే దీన్ని తెలంగాణలో రాజకీయంగా వాడుకొని బీజేపీ లబ్ధి పొందుతుందన్న కారణంగా ఎంఐఎం పార్టీ వెనక్కి తగ్గిందని టీఆర్ఎస్ భేషరతుగా మద్దతు ఇచ్చిందని తెలిసింది. కేసీఆర్ వ్యూహమే ఎంఐఎం లొంగిపోవడానికి కారణమంటున్నారు.