షర్మిలతో జగన్ రాయబారం..? రంగంలోకి ఆర్కే?

ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల ఎక్కడా తగ్గడం లేదు. మొన్న నల్లగొండ నేతలతో సమావేశమైన షర్మిల ఈరోజు ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. 21న ఖమ్మం జిల్లా పర్యటనను ఖాయం చేసుకున్నారు. మార్చి 1న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో పార్టీ ప్రకటనకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ లో చేవెళ్ల నుంచి పాదయాత్రకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలతో షర్మిల ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ […]

Written By: NARESH, Updated On : February 11, 2021 10:28 pm
Follow us on

ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల ఎక్కడా తగ్గడం లేదు. మొన్న నల్లగొండ నేతలతో సమావేశమైన షర్మిల ఈరోజు ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. 21న ఖమ్మం జిల్లా పర్యటనను ఖాయం చేసుకున్నారు. మార్చి 1న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో పార్టీ ప్రకటనకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ లో చేవెళ్ల నుంచి పాదయాత్రకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఈ పరిణామాలతో షర్మిల ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పెట్టేందుకే రెడీ అయినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే దీన్ని ఆపేందుకు జగన్ రంగంలోకి దిగినట్టు సమాచారం. వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం సుతారం జగన్ కు ఇష్టం లేదని ఇప్పటికే నచ్చచెప్పినా వినకుండా షర్మిల పార్టీ పెడుతున్నట్టు ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా అమరావతి నుంచి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్ది లోటస్ పాండ్ కు వచ్చారు. వైఎస్ షర్మిల.. ఆమె భర్త బ్రదర్ అనిల్ ను కలిశారు. సహజంగా ఎమ్మెల్యే ఆర్కేకు షర్మిలతో ఏం అవసరం లేదు. ఆయన జగన్ దూతగానే హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ దూతగా వచ్చారని ప్రచారం సాగుతోంది.

షర్మిల పార్టీ ఆలోచన విరమించుకోవాలని ఆర్కే ఒత్తిడి తీసుకురావడానికే వచ్చినట్లు సమాచారం. ఇప్పటికీ పార్టీ ప్రకటన చేయలేదు కాబట్టి.. ఎలాగోలా ఆపాలన్న ప్రయత్నంలోనే ఆళ్లను జగన్ పంపినట్టు సమాచారం.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ సీఎం జగన్ సన్నిహితుడు. ఇద్దరూ గత ఎన్నికల్లో సహకరించుకున్నారు. జగన్ గెలుపులో కేసీఆర్ పాత్ర ఉంది. పైగా ప్రాజెక్టుల విషయంలోనూ ఇద్దరు సీఎంలు సామారస్యంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ కు అండగా ఉంటూ ఏపీ సీఎం జగన్ తన రాష్ట్రంలో కూడా కేసీఆర్ తీసుకుంటున్నారు.

ఇప్పుడు షర్మిల పార్టీ పెడుతుండడంతో కేసీఆర్, టీఆర్ఎస్ వర్గాలు గుర్రుగా ఉన్నాయంటున్నారు. అదే జరిగితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని జగన్ భావిస్తున్నారు. అందుకే తన చెల్లికి నచ్చ జెప్పేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని.. అందుకే తనకు సన్నిహితుడైన ఎమ్మెల్యే ఆర్కేను రాయబారిగా పంపారని చెబుతున్నారు. మరి ఆర్కే మాటను షర్మిల ఉంటుందా? పార్టీని వాయిదా వేస్తుందా అనేది చూడాలి.