https://oktelugu.com/

బాలయ్య అల్లుడి ‘గీతం వర్సిటీ’కి షాకిచ్చిన జగన్ సర్కార్

సీఎం జగన్ గద్దెనెక్కగానే చంద్రబాబు ముచ్చటపడి కట్టించుకున్న ‘ప్రజావేదిక’ నిర్మాణాన్ని కూల్చి టీడీపీ నేతలకు హెచ్చరికలు పంపారు. టీడీపీ నేతలు ఆక్రమించుకున్న సెంట్ ప్రభుత్వ భూమిని కూడా వదలనంటూ హింట్ ఇచ్చారు.అయితే మొదట్లో హడావుడి చేసిన జగన్ ఆ తర్వాత చల్లబడ్డారు. తాజాగా మరోసారి కూల్చివేతల పరంపరకు తెరతీశారు. ఈసారి టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలయ్య అల్లుడిపై పడ్డారు. Also Read: రైతు ఉద్యమంలోకి లోకేష్‌ సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు, టీడీపీ విశాఖ ఎంపీగా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2020 / 02:19 PM IST
    Follow us on

    సీఎం జగన్ గద్దెనెక్కగానే చంద్రబాబు ముచ్చటపడి కట్టించుకున్న ‘ప్రజావేదిక’ నిర్మాణాన్ని కూల్చి టీడీపీ నేతలకు హెచ్చరికలు పంపారు. టీడీపీ నేతలు ఆక్రమించుకున్న సెంట్ ప్రభుత్వ భూమిని కూడా వదలనంటూ హింట్ ఇచ్చారు.అయితే మొదట్లో హడావుడి చేసిన జగన్ ఆ తర్వాత చల్లబడ్డారు. తాజాగా మరోసారి కూల్చివేతల పరంపరకు తెరతీశారు. ఈసారి టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలయ్య అల్లుడిపై పడ్డారు.

    Also Read: రైతు ఉద్యమంలోకి లోకేష్‌

    సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు, టీడీపీ విశాఖ ఎంపీగా గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన శ్రీభరత్ కు చెందిన గీతం వర్సిటీ పై ఏపీ సర్కార్ పడింది. ఈ వర్సిటీ చైర్మన్ గా శ్రీభరత్ కొనసాగుతున్నారు. తాజాగా గీతం వర్సిటీ అక్రమాలపై నిగ్గుతేల్చిన ఏపీ సర్కార్ ఈ తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా 200మంది అధికారులతో.. ప్రొక్లెయినర్ లతో వచ్చి కూల్చివేసింది.

    విశాఖను ఏపీ పరిపాలన రాజధానిగా ప్రకటించిన సీఎం జగన్ అక్కడ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతునారు..ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించారంటూ విశాఖ గీతం విశ్వవిద్యాలయంలోని కొన్ని కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేయడం సంచలనంగా మారింది.

    తాజాగా యూనివర్సిటీ ప్రధాన ద్వారం, ప్రహరీ గోడ కొంతభాగం, సెక్యూరిటీ గదులను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. జీవీఎంసీ అధికారులు జేసీబీ, బుల్ డోజర్లతో కూల్చివేత చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత నేపథ్యంలో బీచ్ రోడ్డు మీదుగా విశ్వవిద్యాలయానికి వెళ్లే మార్గాన్ని అధికారులు రెండు వైపులా మూసివేశారు.

    టీడీపీ ఎంపీ అభ్యర్థి, నేతకు సంబంధించిన గీతం వర్సిటీని కూల్చడం కక్షసాధింపు చర్యగా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. విశాఖలో ఎన్నో అక్రమ భవనాలు ఉండగా లేనిది.. గీతం వర్సిటీనే ఎందుకు కూలుస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కూల్చివేత సమాచారం తెలిసి టీడీపీ శ్రేణులు వర్సిటీ వద్దకు చేరుకున్నారు. ఆందోళన చేపట్టారు. ఇప్పుడక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

    విశాఖ ఆర్డీవో కిషోర్‌ ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. ఇప్పటికే గీతం వర్సిటీ ప్రభుత్వం భూమిని ఆక్రమించిందని విచారణలో తేలింది. రుషికొండ, ఎండాడలలో 40.51 ఎకరాల్లో గీతం యాజమాన్యం చేపట్టిన నిర్మాణాలపై రెవెన్యూ యంత్రాంగం విచారణ జరిపింది. సిఫార్సుల ఆధారంగా చర్యలు చేపట్టింది. ఈ ఉదయం ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది.

    అయితే నోటీసులు ఇవ్వకుండానే ఎలా కూల్చివేస్తారని గీతం వర్సిటీ ప్రశ్నించింది. ఇదంతా కక్షసాధింపు చర్య అంటూ గీతం వర్సిటీ ఆరోపించింది.

    Also Read: చంద్రబాబుకు మోడీ రిటర్న్‌ గిఫ్ట్‌

    అయితే టీడీపీతో ఉన్న మూలాల దృష్ట్యానే గీతం వర్సిటీపై జగన్ సర్కార్ పగ బట్టిందన్న విమర్శలు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. చంద్రబాబు బామ్మర్ధి బాలయ్య అల్లుడికి చెందిన వర్సిటీ కావడం.. నారా లోకేష్ తోడల్లుడు శ్రీభరత్ కావడం.. చంద్రబాబుకు దగ్గరి చుట్టరికం కావడంతో జగన్ సర్కార్ నజర్ పెట్టిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

    • కట్టడం చేతకాదు.. గీతం వర్సిటీని కూల్చుతారా: చంద్రబాబు

    గీతం వర్సిటీలో కూల్చివేతలను టీడీపీ అధినేత చంద్రబాబు తీప్పుపట్టారు.కట్టడం చేతకాని వాళ్లకు కూల్చే హక్కు లేదని టీడీపీ అధినేత అన్నారు. గీతం సంస్థలపై రాజకీయ కక్ష సాధింపు చర్య ఇదీ అని..తుగ్గక్ చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. కరోనా సమయంలో గీతం వర్సిటీ కోట్ల నష్టాన్ని భరించి 2590మంది కరోనా బాధితులకు వైద్య చికిత్సను గీతం అందించిందని.. సరస్వతి నిలయాన్ని అర్ధరాత్రి 200 మందితో వెళ్లి కూల్చడం దారునమని అన్నారు. వైసీపీ సర్కార్ కక్షసాధింపురాజకీయాలకు పాల్పడుతోందని బాబు ధ్వజమెత్తారు.