పాతతరం నాటి సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో కీర్తి సురేష్ నటించి మెప్పించింది. సావిత్రి పాత్రలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకుగాను ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కిన సంగతి తెల్సిందే. ఈ మూవీ తర్వాత కీర్తి సురేష్ అన్ని లేడి ఓరియెంటేడ్ పాత్రల్లో నటిస్తోంది.
Also Read: బన్నీ పిల్లల ‘ఫ్రైడే నైట్ డ్యాన్స్ పార్టీ’ వైరల్..!
ఇటీవల ఆమె నటించిన ‘పెంగ్విన్’ సైతం లేడి ఓరియంటేడ్ మూవీనే. థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా ఓటీటీలో రిలీజై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే మహానటి తర్వాత కీర్తిసురేష్ నటిస్తున్న ‘మిస్ ఇండియా’ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ఫస్టు లుక్.. టీజర్.. సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ మూవీ గతంలోనే పూర్తయినా థియేటర్లు మూతపడటంతో సినిమా రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
‘మిస్ ఇండియా’ మూవీ కొద్దిరోజులుగా ఓటీటీలో విడుదల అవుతుందని జోరుగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే నవంబర్ 4న నెట్ ఫిక్స్ ఓటీటీలో ‘మిస్ ఇండియా’ సినిమా రాబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్రబృందం ఓటీటీలో రిలీజ్ చేసింది. 2నిమిషాల 18సెకన్ల నిడివితో విడుదలైన ట్రైలర్ చివరి వరకు ఆకట్టుకుంది.
‘మిస్ ఇండియా’ ట్రైలర్ చూస్తుంటే ఓ మధ్యతరగతికి చెందిన యువతి మహిళా వ్యాపారవేత్తగా ఎలా ఎదిగింది అనేది కథగా అర్థమవుతోంది. ట్రైలర్ ప్రారంభంలోనే ఒక చిన్నమ్మాయిని పెద్దయ్యాక ఏమవుతావ్? అనే ప్రశ్నను టీచర్ అడుగగా..‘ఎంబీఏ చేసి బిజినెస్ స్టాట్ చేస్తాను’ అంటూ సమాధానమివ్వడం అందరినీ ఆకట్టుకుంది. తన కలను నెరవేర్చుకునే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులన్నీంటిని ట్రైలర్లో చూపించారు. ‘మిస్ ఇండియా’తో కీర్తి సురేష్ మరోసారి తన నటవిశ్వరూపం చూపించడం ఖాయంగా కన్పిస్తోంది.
Also Read: ఆర్ఆర్ఆర్’ పై లొల్లి షూరు చేసిన ఆదివాసులు..!
ఈ మూవీకి థమన్ సంగీతం ప్లస్ అయ్యేలా కన్పిస్తోంది. ట్రైలర్ కు అతడు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘మిస్ ఇండియా’కు నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మించాడు. ఈ సినిమాలో జగపతి బాబు.. నవీన్ చంద్ర.. రాజేంద్రప్రసాద్.. నదియా.. సీనియర్ నరేష్.. కమల్ కామరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ‘మిస్ ఇండియా’ పక్కా హిట్ అనే టాక్ విన్పిస్తోంది.