తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ‘కేటీఆర్ సీఎం’ అన్న ప్రచారం ఉధృతంగా సాగుతోంది. మంత్రులు తలసాని, ఈటల ఇప్పటికే కేటీఆర్ సీఎం అయితే తప్పు ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు వంతు వచ్చింది.
Also Read: ఎంత గొప్ప పనిచేశావ్?.. అసలు సిసలు లీడర్ అంటే నువ్వేనయ్య హరీష్ రావు
దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ తోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
అతి త్వరలోనే కాబోయే సీఎం కేటీఆర్ కు శుభాకాంక్షలు.. శాసనసభ, రైల్వే కార్మికుల తరుఫున శుభాకాంక్షలు చెబుతున్నా.. కేటీఆర్ సీఎం అయ్యాక రైల్వే ఉద్యోగులను కాపాడాలని ఆకాంక్షిస్తున్నా అని పద్మారావు హాట్ కామెంట్స్ చేశారు.
Also Read: ఎడతెగని ‘పంచాయితీ’.. నిమ్మగడ్డకు షాక్.. సుప్రీంకు జగన్
మంత్రి కేటీఆర్ పక్కన ఉండగానే పద్మారావు శుభాకాంక్షలు తెలుపడం.. దానికి కేటీఆర్ మౌనంగా ఉండడంతో కేటీఆర్ సీఎం ఊహాగానాలు నిజమేనని అనిపించకమానదు.
ఇక ఆ తర్వాత మాట్లాడిన కేటీఆర్ ఈ విషయంపై ఒక్క మాట మాట్లాడలేదు. రైల్వే ఉద్యోగుల సమస్యలు, రైల్వేల్లో తెలంగాణకు నష్టంపైనే మాట్లాడుకొచ్చారు. అంతేకానీ అస్సలు ‘కేటీఆర్ సీఎం’ వ్యాఖ్యలపై స్పందించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్ని బట్టి త్వరలోనే కేటీఆర్ పట్టాభిషేకం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్