https://oktelugu.com/

వరద సాయం కొనసాగుతుంది.. బాధితులు అధైర్య పడొద్దు: జీహెచ్ఎంసీ

జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు హైదరాబాద్లో వరదలు ముంచెత్తాయి. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఎన్నికల సమయంలో కొన్ని ఏరియాల్లో వరదసాయం 10వేల చొప్పున పంపిణీ చేశారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ వరదసాయంపై ఎన్నికల కోడ్ విధించింది. Also Read: అవును..కేసీఆర్ మోడీని మెచ్చుకున్నారు..!? జీహెచ్ఎంసీ ఫలితాలు వెల్లడయ్యాక డిసెంబర్ 7నుంచి వరద సాయం పంపిణీ చేస్తామని సాక్ష్యాత్ సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రకటించారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 9, 2020 / 03:52 PM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు హైదరాబాద్లో వరదలు ముంచెత్తాయి. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఎన్నికల సమయంలో కొన్ని ఏరియాల్లో వరదసాయం 10వేల చొప్పున పంపిణీ చేశారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ వరదసాయంపై ఎన్నికల కోడ్ విధించింది.

    Also Read: అవును..కేసీఆర్ మోడీని మెచ్చుకున్నారు..!?

    జీహెచ్ఎంసీ ఫలితాలు వెల్లడయ్యాక డిసెంబర్ 7నుంచి వరద సాయం పంపిణీ చేస్తామని సాక్ష్యాత్ సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రకటించారు. దీంతో రెండ్రోజులుగా బాధితులంతా మీసేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నాయి. అయితే మీసేవా సెంటర్లు తెరుచుకోకపోవడంతో బాధితులు ఆందోళనలు చేపడుతున్నారు.

    ఈక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇటీవల స్పందిస్తూ బాధితులు ఎవరూ కూడా మీసేవా సెంటర్లకు రావద్దని సూచించారు. బాధితుల అకౌంట్లకు ఆధార్ లింకు చేసి నగదు వారి ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. అయితే దీనిపై బాధితులు నిరసన వ్యక్తం చేస్తూ సీఎం క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించగా పోలీసులు వారిని అడ్డుకోవడం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

    Also Read: కొత్త వ్యవసాయ చట్టాల్లో మార్పులకు కేంద్రం సుముఖం?

    అలాగే కొన్ని డివిజన్లలో కార్పొరేటర్ల ఇళ్లను బాధితులు మట్టించారు. మరికొన్నిచోట్ల మీసేవా కేంద్రాల వద్ద ధర్నాలు చేపట్టారు. ఈనేపథ్యంలోనే జీహెచ్ఎంసీ తాజా మరోసారి స్పందించింది. గ్రేటర్లో వరద బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో జీహెచ్ఎంసీ నిస్సహాయత వ్యక్తం చేస్తుందనే వార్తలో నిజంలేదని స్పష్టం చేసింది.

    గ్రేటర్ పరిధిలోని అన్ని ఏరియాల్లో వరద బాధితులకు సాయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. మంగళవారం ఒక్కరోజే 7,939మంది బాధితులకు రూ.7.94 కోట్లను సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతీఒక్కరికి వరద సాయం అందుతుందని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్