https://oktelugu.com/

కొత్త వ్యవసాయ చట్టాల్లో మార్పులకు కేంద్రం సుముఖం?

వ్యవసాయ సంస్కరణ పేరిట కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్తచట్టాలను రద్దు చేయాలని కొద్దిరోజులుగా రైతులు నిరసనలు చేపడుతున్నారు. ఢిల్లీలో వణికించే చలిలోనూ రైతులు 13రోజులుగా నిరసన చేపడుతున్నారు. ఓవైపు కేంద్రం రైతుల మధ్య చర్చలు జరుగుతుండగానే రైతు సంఘాల నాయకులు నిన్న భారత్ బంద్ కు పిలుపునిచ్చి విజయవంతం చేశారు. Also Read: మోదీని పొగుడుతూ కేసీఆర్ లేఖ.. వ్యూహంలో భాగమేనా? రైతులు చేపట్టిన భారత్ బంద్ కు అన్నివర్గాల నుంచి అనుహ్యమైన మద్దతు లభించింది. దేశంలోని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 9, 2020 / 03:21 PM IST
    Follow us on

    వ్యవసాయ సంస్కరణ పేరిట కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్తచట్టాలను రద్దు చేయాలని కొద్దిరోజులుగా రైతులు నిరసనలు చేపడుతున్నారు. ఢిల్లీలో వణికించే చలిలోనూ రైతులు 13రోజులుగా నిరసన చేపడుతున్నారు. ఓవైపు కేంద్రం రైతుల మధ్య చర్చలు జరుగుతుండగానే రైతు సంఘాల నాయకులు నిన్న భారత్ బంద్ కు పిలుపునిచ్చి విజయవంతం చేశారు.

    Also Read: మోదీని పొగుడుతూ కేసీఆర్ లేఖ.. వ్యూహంలో భాగమేనా?

    రైతులు చేపట్టిన భారత్ బంద్ కు అన్నివర్గాల నుంచి అనుహ్యమైన మద్దతు లభించింది. దేశంలోని దాదాపు అన్నిరాజకీయ పార్టీలు మద్దతు తెలుపడంతోపాటు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. కాంగ్రెస్.. టీఆర్ఎస్.. టీడీపీ.. వైసీపీ.. వామపక్ష పార్టీలు రైతులకు మద్దతు తెలుపడంతో తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ సంపూర్ణంగా కొనసాగింది.

    ఈక్రమంలోనే రైతులతో కేంద్రం నిన్న రాత్రి చర్చలు జరిపింది. అయితే ఆ చర్చలు సైతం అసంపూర్తిగా నిలిచాయి. అయితే తాజా సమాచారం మేరకు రైతులు డిమాండ్ల మేరకు కొత్త వ్యవసాయ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    Also Read: అవును..కేసీఆర్ మోడీని మెచ్చుకున్నారు..!?

    రైతుల డిమాండ్ల మేరకు ఏపీఎంసీల్లో ఓకే ట్యాక్స్‌‌పై కేంద్రం సానుకూలంగా ఉందని సమాచారం. అలాగే ప్రైవేట్ కొనుగోలు దారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్.. ప్రభుత్వం పంట సేకరణ చేసేలా మార్పులు.. వ్యాపారులకు రైతుల మధ్య కాంట్రాక్ట్ వివాదాల పరిష్కారాలకు కలెక్టర్ అధికారాలపై సవరణలకు కేంద్రం సముఖత వ్యక్తం చేస్తోంది.

    అలాగే ఒప్పంద వ్యవసాయంలో సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించడం.. రైతుల భూములకు రక్షణ కల్పించడం వంటి అంశాలపై కేంద్రం సానుకూలంగా ఉంది. పంట వ్యర్థాల దహనంపై పంజాబ్.. హర్యానా రైతుల అభిప్రాయాలను పరిణలోనికి తీసుకొని నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రైతులకు కేంద్రానికి మధ్య చర్చలు సఫలమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్