https://oktelugu.com/

‘అల్లు స్నేహ’ వదిన ఆ గ్లాస్ దాచండి !

పట్టింపులు పద్దతలు మిడిల్ క్లాస్ లో గాని, హై క్లాస్ లో అలాంటివేవి ఉండవని తాజాగా ఓ ఫోటో ద్వారా తేలిపోయింది. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో నెటిజన్లను ఆలోచనలో పడేసింది. ఉదయ్ పుర్ లో నిహారిక వెడ్డింగ్ కి సంబంధించిన సంగీత్ లో బన్నీ దంపతులు జంటగా మంచి ఫోటో తీసుకుని.. దాన్ని కాస్త ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఫొటోలో అల్లు అర్జున్… […]

Written By:
  • admin
  • , Updated On : December 9, 2020 / 04:01 PM IST
    Follow us on


    పట్టింపులు పద్దతలు మిడిల్ క్లాస్ లో గాని, హై క్లాస్ లో అలాంటివేవి ఉండవని తాజాగా ఓ ఫోటో ద్వారా తేలిపోయింది. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో నెటిజన్లను ఆలోచనలో పడేసింది. ఉదయ్ పుర్ లో నిహారిక వెడ్డింగ్ కి సంబంధించిన సంగీత్ లో బన్నీ దంపతులు జంటగా మంచి ఫోటో తీసుకుని.. దాన్ని కాస్త ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఫొటోలో అల్లు అర్జున్… స్టైలిష్ స్టార్ అన్న తన ఇమేజ్ కి తగ్గట్లే యమా స్టైలిష్ గా కనిపించాడు, అలాగే అల్లు స్నేహ కూడా చాలా ఫ్యాషనబుల్ గా కనిపించారు.

    Also Read: పక్కా కామెడీ చేయబోతున్న రవితేజ !

    ఇంతవరకూ బాగానే ఉంది. పైగా ఫొటోలో ఈ జంట నిజంగానే చూడముచ్చటగా ఉన్నారనిపించుకున్నారు. ఐతే, స్నేహ పక్కన ఉన్న టేబుల్ పై రెండు వైన్ తో నిండిన గ్లాసులు కూడా తమ ఫొటోలో పడిన విషయాన్ని ఈ జంట చూసినట్టు లేదు. పాపం పెళ్లి హడావుడిలో ఫోటో సరిగ్గా చూసుకోకుండా ఫోటో షేర్ చేసింది స్నేహ. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫొటోలో వైన్ గ్లాస్ లు చూసి.. వదిన కాస్త ఆ గ్లాసులు దాచండి అంటూ ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

    Also Read: పాపం బాలయ్య.. చివరకు ‘తమన్నా’నే దిక్కు !

    పాపం అల్లు స్నేహ ఈ విధంగా బుక్ అయ్యారు. అయినా… సంగీత్ అన్నాకా విందు, మందు, చిందు లాంటి పద్ధతులు సర్వసాధారణం కదా.. అయినా గ్లాస్ లు ఉన్నంత మాత్రానా తాగినట్టు కాదు కదా.. ఎంతైనా నెటిజన్లు ఎక్కడ తప్పు దొరుకుతుందా ? ఎవర్నీ తిట్టాలా అన్నట్లు ఉంటారు. అసలు ఫొటోలో వైన్ గ్లాస్ లు ఉంటే తప్పు ఏముంది ? అలాంటి ఫంక్షన్ లో మందు గ్లాస్ లు, ఫుడ్ ప్లేట్స్ ఫ్రేమ్ లో పడకుండా ఫోటో తీసుకోవాలంటే ఎంత కష్టమో వాళ్ళకేం తెలుసు. ఏది ఏమైనా ఈ ఫోటో పై మాత్రం నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్