https://oktelugu.com/

అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్.. ప్రజలకు గొప్ప ఊరట..

అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను దేశంలో వినియోగించడానికి వీలుగా ఆ సంస్థ దరఖాస్తు అందిందని డీసీజీఐ వర్గాలు తెలిపాయి. మన దేశంలో కరోనా టీకా వినియోగం కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న మొదటి సంస్థ ఇదే కావడం గమనార్హం. అమెరికాకు చెందిన ఈ ఫైజర్ వ్యాక్సిన్ 95శాతం సక్సెస్ రేటు సాధించింది. ఈ సంస్థతో అమెరికా ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకుంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2020 11:40 am
    Follow us on

    అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను దేశంలో వినియోగించడానికి వీలుగా ఆ సంస్థ దరఖాస్తు అందిందని డీసీజీఐ వర్గాలు తెలిపాయి.
    మన దేశంలో కరోనా టీకా వినియోగం కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న మొదటి సంస్థ ఇదే కావడం గమనార్హం.

    అమెరికాకు చెందిన ఈ ఫైజర్ వ్యాక్సిన్ 95శాతం సక్సెస్ రేటు సాధించింది. ఈ సంస్థతో అమెరికా ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకుంది. అయితే దీన్ని మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ లో భద్రపరచాలి. అంత ఉష్ణోగ్రత భారత దేశంలో సాధ్యం కాదు. అందుకే ఈ ఫైజర్ టీకాతో భారత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదు. అమెరికా, జర్మనీలు కూడా ఈ వ్యాక్సిన్ కు ఇంకా అనుమతులు ఇవ్వలేదు.

    నిబంధనల ప్రకారం అనుమతి కోరిన 90 రోజుల్లో బదులు ఇవ్వాలి. యూకే, బహ్రెయిన్ లో ఫైజర్ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇస్తే డీసీజీఐ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యూకే, బహ్రెయిన్ లో ఈ ఫైజర్ వ్యాక్సిన్ అనుమతులు పొందింది. అక్కడ అమ్మకాలను మొదలుపెట్టింది.

    భారత డీసీజీఐ అనుమతులు ఇస్తే ఇక దేశంలోని ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ వేయడం వీలవుతుంది. తద్వారా కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడిన వారు అవుతారు. అయితే దేశీయంగా తయారైన వ్యాక్సిన్ నే ప్రజలకు పంచాలని భారత్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.