నివర్ తుఫానుతో ఏపీలోని రైతాంగం తీవ్రంగా దెబ్బతింది. రైతులను ఆదుకోవాలని గత కొద్దిరోజులుగా ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈక్రమంలోనే బాధితులకు జనసేనాని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోకుంటే ఈనెల 7న నిరసన దీక్ష చేపడుతామని పవన్ నిన్న ప్రకటించారు.
నివర్ తుఫాన్ బాధితులకు ప్రభుత్వం తక్షణసాయం కింద రూ.10వేలతోపాటు రూ.35వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పవన్ చెప్పినట్టుగానే నేడు ఆయన స్వగృహంలో నిరసన దీక్షకు దిగారు. ఉదయం 10గంటల నుంచి పవన్ దీక్షలో పాల్గొన్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది.
గత రెండ్రోజులుగా పవన్ కల్యాణ్ నివర్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వానికి మద్యం ద్వారా అధిక ఆదాయం వస్తుందని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
పవన్ నేరుగా దీక్షకు పూనుకోవడం జనసైనికులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. పవన్ దీక్షకు ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తీవ్రతరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే జగన్ సర్కార్ కు ఇది ఇబ్బందికరంగా మారనుండటంతో ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా సానుకూల ప్రకటన వచ్చే ఉంది.
తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10 వేలు ఇవ్వాలన్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి డిమాండ్ కు ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా ఈ రోజు తన నివాసంలో ఉదయం 10గం.లకు దీక్షలో కూర్చున్నారు.#JanaSenaRythuDeeksha pic.twitter.com/xZJqMgt3Ck
— JanaSena Party (@JanaSenaParty) December 7, 2020