https://oktelugu.com/

రైతుల ఆవేదన.. పోస్టుకార్డుల రూపంలో రాష్ట్రపతికి..!

కేంద్రం వ్యవసాయ సంస్కరణ పేరిట ఇటీవల తీసుకొచ్చిన మూడు బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు కొద్దిరోజులుగా ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. ఢిల్లీలో వణికించే చలిలోనూ 12రోజులుగా రైతులు ఆందోళనలు చేపడుతుండటంతో వారికి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. Also Read: భారత్ బంద్.. ఢిల్లీ సీఎంను గృహనిర్భంధం చేసిన పోలీసులు..! ఇప్పటికే పలుమార్లు కేంద్రం.. రైతుల మధ్య చర్చలు జరిగినా ఫలితం రాకపోవడంతో రైతు సంఘాల నాయకులు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. నేటి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 8, 2020 / 12:55 PM IST
    Follow us on

    కేంద్రం వ్యవసాయ సంస్కరణ పేరిట ఇటీవల తీసుకొచ్చిన మూడు బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు కొద్దిరోజులుగా ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. ఢిల్లీలో వణికించే చలిలోనూ 12రోజులుగా రైతులు ఆందోళనలు చేపడుతుండటంతో వారికి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది.

    Also Read: భారత్ బంద్.. ఢిల్లీ సీఎంను గృహనిర్భంధం చేసిన పోలీసులు..!

    ఇప్పటికే పలుమార్లు కేంద్రం.. రైతుల మధ్య చర్చలు జరిగినా ఫలితం రాకపోవడంతో రైతు సంఘాల నాయకులు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. నేటి ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు భారత్ బంద్ కొనసాగుతుందని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. రైతులంతా శాంతియుతంగా ఉద్యమం చేయాలని నేతలు కోరుతున్నారు.

    నేటి భారత్ బంద్ లో ప్రజలంతా స్వచ్చంధంగా బంద్ లో పాల్గొంటున్నారు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు పూర్తిగా మూసివేశారు. బస్సులు.. రైళ్లు నిలిచిపోయాయి. రోడ్లపై ఆయా పార్టీల రాస్తారోకోలతో పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇదిలా ఉంటే రైతులు తమ ఆవేదనను రాష్ట్రపతికి పోస్టు కార్డుల రూపంలో వెలిబుచ్చే ప్రయత్నం చేశారు.

    Also Read: భారత్ బంద్ లో ఉద్రిక్తత.. ఒకరిపై చేయిచేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

    కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ 9లక్షల మంది రైతులు పోస్టు కార్డలపై సంతకాలు చేసి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపించారు. దేశంలోని రైతులను ఆదుకోవాలని కర్ణాటక కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈమేరకు సంతకాల సేకరణ చేపట్టారు.

    ఈ కార్యక్రమానికి అన్నివర్గాల నుంచి అనూహ్య స్పందన రావడంపై శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని రైతుల నుంచి పోస్టు కార్డుల ద్వారా సంతకాల సేకరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ పోస్టు కార్డులను రాహుల్ గాంధీ ద్వారా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సచిన్ మిగాకు అందించారని శివకుమార్ తెలిపారు. అయితే రైతుల ఆవేదనపై రాష్ట్రపతి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్