https://oktelugu.com/

విశాఖ మేయర్‌‌ యాదవ వర్గానికే!

ఏపీకి కాబోయే అడ్మినిస్ట్రేషన్‌ రాజధాని విశాఖకు మేయర్‌‌ అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ పదవిని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటాయి. ఇప్పటి వరకు విశాఖను కాంగ్రెస్‌ మేయర్లే ఏలారు. ఈ సారి మాత్రం టీడీపీ, వైపీసీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. టీడీపీ ఎన్టీఆర్‌‌ హయాంలో ఒకసారి మేయర్‌‌ పదవి చేపట్టింది. మళ్లీ ఇప్పటి వరకు ఆ సీటులో కూర్చోలేకపోయింది. ఈ సారి ఎలాగైనా కుర్చీ దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా… అధికార వైసీపీని తట్టుకోని నిలవడం సాధ్యమేనా..! […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 8, 2020 1:52 pm
    Follow us on


    ఏపీకి కాబోయే అడ్మినిస్ట్రేషన్‌ రాజధాని విశాఖకు మేయర్‌‌ అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ పదవిని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటాయి. ఇప్పటి వరకు విశాఖను కాంగ్రెస్‌ మేయర్లే ఏలారు. ఈ సారి మాత్రం టీడీపీ, వైపీసీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. టీడీపీ ఎన్టీఆర్‌‌ హయాంలో ఒకసారి మేయర్‌‌ పదవి చేపట్టింది. మళ్లీ ఇప్పటి వరకు ఆ సీటులో కూర్చోలేకపోయింది. ఈ సారి ఎలాగైనా కుర్చీ దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా… అధికార వైసీపీని తట్టుకోని నిలవడం సాధ్యమేనా..!

    Also Read: పెట్రోల్‌ ధరలు నో బ్రేకులు

    వచ్చే యేడాది ఎన్నికలు

    స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాదిలో జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. మేయర్‌‌ అభ్యర్థిని కూడా ప్రకటించి.. ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే ప్రకటించగా.. టీడీపీ లీడర్‌‌ ఎంపికలో నిమగ్నమైంది. కొన్ని పేర్లు తెరపైకి వచ్చినా అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా టైం ఉంది కదా.. చంద్రబాబు కచ్చితమైన నిర్ణయమే తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    బరిలోకి మా ఎమ్మెల్యే

    గాజువాక మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ని మేయర్ అభ్యర్థిగా నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. యాదవ సామాజికవర్గానికి చెందిన ఈయనకు స్థానికంగా మంచి పాలోయింగ్‌ ఉంది. అయితే గతంలో ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ పల్లా నో చెప్పారంట.. ఇప్పుడురాజకీయ పరిస్థితుల్లో మారడంతో పల్లా తప్పకుండా అంగీకరిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. యాదవ సామాజికవర్గాన్ని తోడు చేసుకుంటే ఈజీగా విజయం సాధించవచ్చని అంటున్నారు.

    Also Read: విజయశాంతి బీజేపీలోనైనా రాణిస్తుందా?

    వైసీపీ తరఫున వంశీకృష్ణ

    వైసీపీ మేయర్‌‌ అభ్యర్థిగా ప్రకటించిన వంశీకృష్ణశ్రీనివాస్ కూడా యాదవ సామాజికవర్గానికి చెందిన వారే. అయితే టీడీపీ అభ్యర్థిగా భావిస్తున్న పల్లా శ్రీనివాస్ తో పోలిస్తే వంశీ కొంత వీక్‌ క్యాండిడేటే. పల్లాకు రాజకీయ పలుకుబడి ఉంది.. బలమైన రాజకీయ కుటుంబం నేపథ్యం కూడా ఉన్నది. అయితే వంశీ అధికార పార్టీ నుంచి బరిలో నిలవనుండడం కలిసివచ్చే అంశం. అడ్మినిస్ట్రేషన్‌ వ్యవస్థలు కూడా కొంత సహకరించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా.. మేయర్ మాత్రం యాదవ సామాజిక వర్గం నేతలే కావడం విశేషం.