https://oktelugu.com/

ఎవ్వరూ చేయలేని పని చేసిన ‘మెగాస్టార్’ !

మలయాళ మెగాస్టార్ గా మమ్ముట్టికి కేరళలో గొప్ప ఫాలోయింగ్ ఉంది. అయినా ఆయన ఎప్పుడూ సింపుల్ గానే ఉంటారు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణాల్లో పట్టుదల కూడా ఒకటి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేయాలనుకున్న పనిని చేసి తీరుతారాయన. కాగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇంట్లోంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని ప్రభుత్వం, వైద్యులు ప్రజలకు సూచించడంతో.. మమ్ముట్టి దాన్ని సవాల్ గా స్వీకరించి.. ఎన్ని రోజులు తానూ ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉండగలనో చూసుకోవాలని తనకు తానే […]

Written By:
  • admin
  • , Updated On : December 8, 2020 / 12:46 PM IST
    Follow us on


    మలయాళ మెగాస్టార్ గా మమ్ముట్టికి కేరళలో గొప్ప ఫాలోయింగ్ ఉంది. అయినా ఆయన ఎప్పుడూ సింపుల్ గానే ఉంటారు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణాల్లో పట్టుదల కూడా ఒకటి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా
    చేయాలనుకున్న పనిని చేసి తీరుతారాయన. కాగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇంట్లోంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని ప్రభుత్వం, వైద్యులు ప్రజలకు సూచించడంతో.. మమ్ముట్టి దాన్ని సవాల్ గా స్వీకరించి.. ఎన్ని రోజులు తానూ ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉండగలనో చూసుకోవాలని తనకు తానే ఛాలెంజ్ విసురుకున్నారు.

    Also Read:  నిహారిక జంట వీడియో వైరల్.. షూట్ చేసింది ఆ దర్శకుడే !

    ఈ విషయాన్ని ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తనకు తానుగా వేసుకున్న ఛాలెంజ్ కోసం మమ్ముట్టి ఏకంగా 275 రోజులు అనగా పూర్తిగా తొమ్మిది నెలలపాటు ఇంటికే పరిమితమైపోయి.. అందరినీ షాక్ కి గురి చేశాడు. మొత్తానికి ఎవ్వరూ చేయలేని పని చేశాడు. 9 నెలలు పూర్తికాగానే గత శుక్రవారం బయటకొచ్చి స్నేహితులని కలిసి సరదాగా టీ సేవించారని.. ప్రస్తుతం ఆయన తన తరువాత సినిమాల పై దృష్టి పెట్టారని.. ఇప్పటికే ఓ సినిమాని వచ్చే వారం నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

    Also Read: ఉప్పెన’ రిలీజ్ ఎప్పుడంటే… అది మెగా ఇమేజ్ కే సాధ్యం !

    ఏది ఏమైనా ఓ మెగాస్టార్ ఇలా ఏకధాటిగా తొమ్మిది నెలలు ఇంట్లోనే ఉండిపోవడమనేది నిజంగా రికార్డే. ఇంతకీ ఆయన ఈ 9 నెలలు ఇంటిలో ఏమి చేశాడు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే మమ్ముట్టి ఈ తొమ్మిది నెలలు పూర్తిగా తన ఫిట్నెస్ మీద దృష్టిపెట్టారని.. ఆయన ఇప్పుడు గతంలో కంటే.. పూర్తిగా ఫిట్ గా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఉత్సాహంగా తిరిగి షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడట. పైగా కరోనా నుండి ఆయన మరింత జాగ్రత్త కోసం సొంత క్యారవాన్ ను కూడా తయారుచేయించుకున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్