https://oktelugu.com/

వాట్సాప్ వాడేవాళ్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే డబ్బులు మాయం..?

మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్ లలో వాట్సాప్ ఒకటనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్ ను కలిగి ఉండటంతో వాట్సాప్ యాప్ ను వినియోగించడానికి యూజర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే సైబర్ మోసగాళ్లు వాట్సాప్ యాప్ వాడేవాళ్లను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవాళ్లకు షాకింగ్ […]

Written By: Kusuma Aggunna, Updated On : April 1, 2021 10:17 am
Follow us on

Fake Messages On WhatsApp

మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్ లలో వాట్సాప్ ఒకటనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్ ను కలిగి ఉండటంతో వాట్సాప్ యాప్ ను వినియోగించడానికి యూజర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే సైబర్ మోసగాళ్లు వాట్సాప్ యాప్ వాడేవాళ్లను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.

Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్..?

వాట్సాప్ ద్వారా మోసపూరిత ప్రకటనలను సర్క్యులేట్ చేస్తూ మోసగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం. వాట్సాప్ యూజర్లలో చాలామంది మోసపూరిత ప్రకటనలను నిజమేనని నమ్మి ఇతరులకు ఆ మెసేజ్ లను ఫార్వర్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్ లో దేశీయ టెలీకాం దిగ్గజం జియో 550 రూపాయల ప్లాన్ ను ఉచితంగా అందిస్తోందని లింక్ ను క్లిక్ చేయడం ద్వారా ఈ ఆఫర్ ను పొందవచ్చని పేర్కొంది.

Also Read: మీ జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందా.. ఏం చేయాలంటే..?

సైబర్ నిపుణులు మాత్రం పొరపాటున ఈ లింక్ ను క్లిక్ చేస్తే మాత్రం ఖాతాలో డబ్బులు మాయమయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఫేక్ లింక్ లను క్లిక్ చేస్తే మొబైల్ లేదా కంప్యూటర్ లో ఉన్న సమాచారాన్ని హ్యాకర్లు దొంగలించే అవకాశం ఉందని.. వాట్సాప్ లో వచ్చే ఫేక్ మెసేజ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలోని ఫేక్ మెసేజ్ ల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచనలు చేస్తున్నారు.

వాట్సాప్ యాప్ ద్వారా వచ్చే ఫేక్ లింక్ లను క్లిక్ చేసి కొంతమంది గతంలో డబ్బులను పోగొట్టుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. వాట్సాప్‌లలో వచ్చే ఇలాంటి సందేశాలను నమ్మితే మాత్రం డబ్బు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.