https://oktelugu.com/

‘ఆచార్య’ సాంగ్: చిరంజీవి 60లోను 20లా డ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి ఇంత ఏజ్ వచ్చినా తనలోని డ్యాన్స్ ప్రతిభ మాత్రం తగ్గ లేదని నిరూపించాడు. ఇప్పటికే ‘ఆచార్య’ నుంచి రాంచరణ్ నక్సలైట్ పాత్ర ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే ‘ఆచార్య’ మూవీ నుంచి ‘లాహే లాహే’ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. కేవలం మ్యూజిక్ బీట్ ఉండేలా వదిలిన ఈ పాట అందరినీ అలరిస్తోంది. చిరంజీవి ప్రోమోలో అదరగొట్టేవాడు. వీణ పట్టుకొని ఉన్న హరిదాసులతో కలిసి చిరంజీవి వేసిన స్టెప్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 31, 2021 / 11:36 AM IST
    Follow us on

    మెగాస్టార్ చిరంజీవి ఇంత ఏజ్ వచ్చినా తనలోని డ్యాన్స్ ప్రతిభ మాత్రం తగ్గ లేదని నిరూపించాడు. ఇప్పటికే ‘ఆచార్య’ నుంచి రాంచరణ్ నక్సలైట్ పాత్ర ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

    తాజాగా ఇదే ‘ఆచార్య’ మూవీ నుంచి ‘లాహే లాహే’ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. కేవలం మ్యూజిక్ బీట్ ఉండేలా వదిలిన ఈ పాట అందరినీ అలరిస్తోంది. చిరంజీవి ప్రోమోలో అదరగొట్టేవాడు. వీణ పట్టుకొని ఉన్న హరిదాసులతో కలిసి చిరంజీవి వేసిన స్టెప్స్ ‘ఇంధ్ర’ సినిమాలోని స్టెప్స్ ను సూచిస్తోంది.

    చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఈ మ్యూజిక్ బీట్ వదిలారు. ఆరుపదుల వయసులోనూ చిరంజీవి తన డ్యాన్స్ కౌశలాన్ని ఇందులో చూపించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ ఫుల్ సాంగ్ త్వరలోనే విడుదల కానుంది.

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. దిగ్గజ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీలో ‘రాంచరణ్’ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది.మే 14 న రిలీజ్ కానున్న ఈ భారీ బ‌డ్జెట్  ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ల‌పై రామ్ చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు.