రాజకీయ నాయకులకు తాగడం అంటే అది కామన్. ఈ కాలంలో ఆడవాళ్లు తాగేస్తున్నారు. అసలు తాగడం అందరికీ ఒక అలవాటుగా మారింది. తాగని వారినే వెరైటీగా చూస్తున్నారు. అయితే ఈ మందు గురించి తాజాగా టీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి హాట్ కామెంట్స్ చేశారు. అధికారులను తాగుబోతులుగా చిత్రీకరించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read: పీసీసీ రేసులో పవన్ కల్యాణ్.. సంచలన కామెంట్స్ చేసిన వీహెచ్..!
ఐనవోలు ‘మల్లన్న జాతార’ ఏర్పాట్లను తాజాగా మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘మేడారం జాతార’లో అధికారులు ఫుల్లుగా తాగి డ్యూటీలు చేశారని మంత్రి ఎర్రబెల్లి అధికారుల తీరును ప్రస్తావించారు. ఈసారి మల్లన్న జాతరకు అలా చేయవద్దని కోరారు. మేడారం జాతార సమయంలో చాలా మంది అధికారులు విధుల్లో మద్యం సేవించారు. ఇలాంటి ప్రవర్తన ఈసారి సహించను. హ్యాంగోవర్‌లో పనికి రావద్దు. పనిలో ఉన్నప్పుడు అధికారులు మద్యం తాగద్దు. స్టిక్ట్ గా పని మీద ఉండాలి. ” అని ఎర్రబెల్లి అన్నట్టు ప్రచారం సాగుతోంది.
Also Read: మద్యం పోయలేదని స్నేహితుడిని చంపేశాడు.. ఎక్కడంటే..?
అక్కడే ఉన్న టిఆర్ఎస్ నాయకులు.. ఇతర అధికారులు మంత్రి వ్యాఖ్యలను చూసి షాకయ్యారు. ఈ వ్యాఖ్యలను అధికారులు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.. ఏ సందర్భం అయినప్పటికీ ఎర్రబెల్లి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ అధికార వర్గాల్లో సంచలనంగా మారాయి.
ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ నేతలు, మంత్రులు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. సిఎం కెసిఆర్, కెటిఆర్‌లు ఈ విషయంపై సీరియస్ గా చెప్పినప్పటికీ టిఆర్‌ఎస్ నాయకుల వైఖరిలో మార్పు లేదు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి సైతం అధికారులపై అనాలోచిత వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్