ఇంకో రోజున్నర సమయం మిగిలి ఉంది. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి.. టీమిండియా లక్ష్యం 407. ఈ లక్ష్యాన్ని అందుకుంటుందా? లేక కాచుకుంటుందా? అన్నది ఇప్పుడు భారత బ్యాట్స్ మెన్ చేతుల్లో ఉంది.
Also Read: క్రికెట్ లో దారుణం.. భారత క్రికెటర్లపై ఆస్ట్రేలియన్ల జాత్యంహకారం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రసకందాయంలో పడింది. ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో 312/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసి భారత్ ముందు 407 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కామెరీన్ గ్రీన్ 84 పరుగులు, కెప్టెన్ పైన్ 39 పరుగులతో ధాటిగా ఆడి ఆస్ట్రేలియాకు భారీ స్కోరును అందించాడు.
182/4తో ఈరోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 130 పరుగులు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత గ్రీన్, పైన్ వేగంగా పరులు తీశాడు. గ్రీన్ వేగంగా ఆడుతూ ఔట్ కావడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.
Also Read: మరో రికార్డుకు చేరువలో ధోనీ
మ్యాచ్ మధ్యలో బౌలర్ సిరాజ్ ను ఆస్ట్రేలియా ప్రేక్షకులు దూషించడం.. జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంతో ఆట ఆగిపోయింది. టీమిండియా ఫీల్డ్ ఎంపైర్లకు ఫిర్యాదు చేయగా.. దూషించిన అభిమానులను ఆస్ట్రేలియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆట కొనసాగింది.
ప్రస్తుతం భారత ఓపెనర్లు గిల్, రోహిత్ లు నిలకడగా ఆడుతున్నారు. బలమైన ఆస్ట్రేలియా బౌలర్లు ధాటిగా బంతులు వేస్తున్నారు. వీరిని కాచుకొని ఇండియన్ బ్యాట్స్ మెన్ నిలబడుతారా? తడబడుతారా? అన్నది వేచిచూడాలి. ఎందుకంటే ఆట మరో రోజు ఉంది. రోజున్నర సేపు టీమిండియా బ్యాట్స్ మెన్ ఆస్ట్రేలియాను కాచుకోవాలి. మరి లక్ష్యం ఛేధించడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. చూడాలి మరీ ఏం జరుగుతుందో..