https://oktelugu.com/

త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది – రామ్

హీరో రామ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా వస్తోందంటూ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. అయినా, ఇటు రామ్ గాని, అటు త్రివిక్రమ్ కానీ ఎక్కడ ఈ వార్త పై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే త్రివిక్రమ్, రామ్ మధ్య కథా పరమైన చర్చలు జరిగాయనేది వాస్తవం. కానీ, ఎట్టకేలకూ రామ్, త్రివిక్రమ్ తో తన సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించి తన ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. […]

Written By:
  • admin
  • , Updated On : January 10, 2021 / 10:28 AM IST
    Follow us on


    హీరో రామ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా వస్తోందంటూ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. అయినా, ఇటు రామ్ గాని, అటు త్రివిక్రమ్ కానీ ఎక్కడ ఈ వార్త పై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే త్రివిక్రమ్, రామ్ మధ్య కథా పరమైన చర్చలు జరిగాయనేది వాస్తవం. కానీ, ఎట్టకేలకూ రామ్, త్రివిక్రమ్ తో తన సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించి తన ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. తన రెడ్‌ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోన్న సందర్భంగా రామ్‌ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

    Also Read: రివ్యూ : క్రాక్ – ఓన్లీ మాస్ కు మాత్రమే !

    ఈ క్రమంలో పలు విషయాలను మీడియాతో పంచుకుంటూ త్రివిక్రమ్ సినిమా గురించి కూడా ప్రస్తావించారు. త్రివిక్రమ్‌ తో గతంలో మాట్లాడానని, మా ఇద్దరి కలయికలో తర్వాత ఓ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. కానీ, ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది ? ఎలాంటి జోనర్ లో ఉంటుంది ? లాంటి డిటైల్స్ ను ఇప్పుడే చెప్పలేం అంటూ మొత్తానికి రామ్, చిన్న క్లారిటీ అయితే ఇచ్చాడు. టాలీవుడ్ టాప్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడ ఒకరు. పైగా ఆయన గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది.

    Also Read: ‘వేదాంతం రాఘవయ్య’ మొదలయ్యాడు !

    అందుకే ప్రతి హీరో త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తనని అప్రోచ్ అయిన రామ్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నాడు. ఇక ‘రెడ్’ తర్వాత రామ్ సినిమాలేవీ కమిటవ్వలేదు. కారణం, గురూజీ కథ చెప్పడం, రామ్ ఒకే చేయడం చకచకా జరిగిపోయాయని.. మొత్తానికి రామ్ కు ఈ విధంగా కలిసొచ్చిందని.. ఈ సినిమా గనుక హిట్టయితే రామ్ మార్కెట్ స్థాయి కూడ మారిపోతుందని అంటున్నారు ఫిల్మ్ జనాలు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్