కేటీఆర్‌‌లో ఈ మార్పుకు కారణమేంటో..?

‘కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం. ఒకరికొకరు సహకరిస్తేనే ప్రజలు హర్షిస్తారు’ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. స్వయానా తెలంగాణ రాష్ట్ర మంత్రి, సీఎం కేసీఆర్‌‌ తనయుడు కేటీఆర్‌‌. అదేంటి.. బీజేపీపై ఎప్పుడూ ఫైర్‌‌తో ఉండే కేటీఆర్‌‌ కూడా ఇలా యూటర్న్‌ తీసుకున్నారంటని ఆలోచిస్తున్నారా..? ఎవరిలో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో ఎవరం ఊహించలేం కదా..! Also Read: కేసీఆర్‌‌ వల్లే బీజేపీ బలపడిందట..: వీహెచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు నిన్నటిదాకా కేంద్రం తెలంగాణను […]

Written By: Srinivas, Updated On : January 10, 2021 10:18 am
Follow us on


‘కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం. ఒకరికొకరు సహకరిస్తేనే ప్రజలు హర్షిస్తారు’ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. స్వయానా తెలంగాణ రాష్ట్ర మంత్రి, సీఎం కేసీఆర్‌‌ తనయుడు కేటీఆర్‌‌. అదేంటి.. బీజేపీపై ఎప్పుడూ ఫైర్‌‌తో ఉండే కేటీఆర్‌‌ కూడా ఇలా యూటర్న్‌ తీసుకున్నారంటని ఆలోచిస్తున్నారా..? ఎవరిలో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో ఎవరం ఊహించలేం కదా..!

Also Read: కేసీఆర్‌‌ వల్లే బీజేపీ బలపడిందట..: వీహెచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

నిన్నటిదాకా కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని.. యుద్ధమే చేయబోతున్నామని చెప్పిన కేటీఆర్ ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్‌ మార్చారు. హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న కేటీఆర్ బద్ధ శత్రువైన బీజేపీని ఒక్క మాట కూడా అనడం లేదు. పైగా కలిసి పని చేద్దామన్నట్లుగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. శనివారం పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ బీజేపీతో ఎలాంటి గొడవలు లేవని చెప్పేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.

కేవలం ఎన్నికలప్పుడే పంచాయతీ అని.. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. సమష్టిగా పని చేసుకుందాం అంటూ స్నేహహస్తాన్ని చాచారు. ఇలా ఆయన అంటున్న సమయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా కార్యక్రమంలో ఉన్నారు. అనవసర పంచాయితీలు మన మధ్య వద్దని ప్రజలు కూడా హర్షించరని ఆయన చెప్పుకొచ్చారు. ఓ వైపు బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ సంగతి తేలుస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నంత పని చేస్తున్నారు.

Also Read: వారసత్వం అందుకోని లోకేష్‌..: చంద్రబాబుకు ఉన్న పరిణతి ఆయనకు లేదే..?

పార్టీ కీలక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే.. టీఆర్ఎస్ నేతలు మాత్రం శాంతి మంత్రం పాటిస్తున్నారు. ఇప్పటివరకూ కేటీఆర్ బీజేపీతో స్నేహం గురించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు.. మాత్రం ఆయన స్నేహం చేసుకుందామని పిలుపిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. మొత్తానికి కారణం ఏమిటో కానీ బీజేపీ విషయంలో టీఆర్ఎస్ పూర్తిగా మారిపోయింది. ఎగిరి ఎగిరి దుమికిన దూకుళ్లు అన్నీ.. కట్టి పెట్టేసి.. సైలెంటవుతున్నారు. దీన్నే అలుసుగా తీసుకుని బీజేపీ నేతలు మరింత రెచ్చిపోతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్