నెలలో కనీసం రెండు ప్రెస్ మీట్లను ఈ మధ్య రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పెడుతున్నాడు. టోటల్ విషయం ఏంటంటే.. ‘పోలవరం ప్రాజెక్టు’పైనే.. ఇందులో జగన్ కేంద్రంతో, తెలంగాణతో లాలూచీ పడి ఎలా ఏపీకి అన్యాయం చేస్తున్నాడే విషయాలపై ఉండవల్లి కడిగిపారేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. తాజాగా పోలవరం సాక్షిగా జగన్ ను మరోసాకి ఇరికించేశాడు ఉండవల్లి.
Also Read: బీజేపీ నేతకు సీపీ సజ్జనార్ కౌంటర్..!
డీపీఆర్ ప్రకారం పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేసుకోవాలని..ప్రాజెక్టులో 41 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలనే జగన్ నిర్ణయం సరికాదని ఉండవల్లి హెచ్చరించారు. ఆ ఆలోచనలు చేయవద్దన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కేంద్రంతో పోరాడి సాధించాలన్నారు. రాజీపడితే రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వారు అవుతారని ఉండవల్లి జగన్ సర్కార్ ను హెచ్చరించారు.
మనకు పోలవరం తప్పితే మరో మార్గం లేదని ఉండవల్లి స్పష్టం చేశారు. మిగతా చోట్ల కొండలు ఉన్నాయని.. తాగునీటికి ఉపయోగించే ప్రాజెక్టులను అభ్యంతరం పెట్టడానికి లేదన్నారు. అయితే క్లాజ్ ఉపయోగించి తెలంగాణ ప్రాజెక్టులు కట్టాలని చూస్తోందని తప్పు పట్టారు. దీనిపై ఆంధ్రావాళ్లే మాట్లాడాలని.. కానీ వాళ్ల ఆస్తులు తెలంగాణలో ఉండడంతో ఎవరూ మాట్లాడడం లేదన్నారు.
Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ పరీక్ష ఎప్పుడంటే..?
పోలవరంపై పోరాడాల్సిందేనని.. అలసత్వం వద్దని జగన్ ను హెచ్చరించారు ఉండవల్లి. డీపీఆర్ ప్రకారం పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. పునరావాస ప్యాకేజీ నిధులపై రాజీపడితే ఏపీకి తీవ్ర ద్రోహం చేసిన వారు అవుతారని.. ఒకసారి నీళ్లు వచ్చాక ఎత్తు పెంచరా లేదా అని ఎవరూ పట్టించుకోరన్నారు. ఆ నీళ్లు అయిపోయాక అప్పుడు రోడ్ల మీదకు జనం వస్తారని.. అప్పటికీ జరగాల్సింది జరిగిపోతుందని ఉండవల్లి ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్