తెలంగాణలో కొద్దిరోజులుగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాకిచ్చిన బీజేపీ ఆ వెంటనే వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తాచాటింది.
Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ పరీక్ష ఎప్పుడంటే..?
దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారిందనే టాక్ విన్పిస్తోంది. ఈక్రమంలోనే బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. అయితే కొందరు నేతలు తెలంగాణ పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొద్దిరోజులుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులపై ఇష్టమొచ్చిన రీతిలో విమర్శలు గుప్పించారు. పోలీసులపై అనవసర వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబడుతూ సీపీ సజ్జనార్ తాజాగా కౌంటర్ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది.
Also Read: తిరుపతి ఫైట్: బీజేపీతో నో కాంప్రమైజ్.. మళ్లీ ఢిల్లీకి పవన్?
కొందరు రాజకీయ నేతలు ఇటీవల కాలంలో పోలీసుల మీద.. డీజీపీ మీద కామెంట్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయిందంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు పోలీసుల మీద అనవసర ఆరోణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులను అవమానించేలా బీజేపీ నేతలు మాట్లాడితే సహించలేదని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నట్లు సీపీ స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్