కరోనా వైరస్ నుంచి ప్రపంచం ఇంకా తెరుచుకోనే లేదు. ప్రజలంతా ఇప్పుడిప్పుడే కరోనాపై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉంటున్నారు. అప్పుడే మరో ఉపద్రవం కొత్త వైరస్ రూపంలో ముంచుకొస్తోంది.
తాజాగా కరోనా 2.0(కొత్తరకం వైరస్) బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో విజృంభిస్తోంది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. భారత్ సైతం నేటి నుంచి బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది.
Also Read: జగన్ ను మళ్లీ ఇరికించిన ఉండవల్లి అరుణ్ కుమార్
అయితే గత వారంరోజులుగా బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు 358మంది వచ్చారని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. యూకేలోని కొత్తరకం స్ట్రెయిన్‌పై కేంద్రం నుంచి పలు సూచనలు వచ్చాయని తెలిపారు.
యూకే నుంచి సోమవారం ఏడుగురు మాత్రమే హైదరాబాద్‌కు వచ్చారని తెలిపారు. కాగా ఈనెల 15 నుంచి 21తేదీల మధ్య మొత్తం 358 మంది ప్రయాణికులు బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చారని పేర్కొన్నారు.
యూకే నుంచి వచ్చిన వారంతా బాధ్యతగా వ్యవహరించి 040-24651119 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇవ్వని యూకే ప్రయాణికులను ట్రాక్ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: బీజేపీ నేతకు సీపీ సజ్జనార్ కౌంటర్..!
ఈ కొత్తరకం వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ మరణాలు చాలా తక్కువగానే నమోదవుతున్నట్లు తెలిపారు.
ఇప్పటికే వైద్య శాఖను సీఎం కేసీఆర్ అప్రమత్తం చేసినట్లు తెలిపారు.తెలంగాణలో ఇప్పటి వరకు కొత్తరకం వైరస్ కేసులు ఒకటి కూడా నమోదు కాలేదని తెలిపారు.
ప్రస్తుతం ప్రజలు విందు, వినోదాలకు దూరంగా ఉండాలని సూచించారు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాస రావు కోరారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్