https://oktelugu.com/

Rajamouli Mahesh: రాజమౌళి కోసం బెండ్ అయిన మహేష్.. షాకింగ్ కారణం

Rajamouli, Mahesh: ఈ సంక్రాంతి 2022 బరిలో ఇప్పటికే నాలుగు పెద్ద సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. రాజమౌళి అక్టోబర్ 13న తన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రకటించడంతో మిగతా అగ్రహీరోలంతా సంక్రాంతికి ఖర్చీఫ్ వేసేశారు. ‘ఆర్ఆర్ఆర్’ పోటీపడకూడదనే ఇలా దూరంగా జరిగారు. అయితే సంక్రాంతి 2022లో థియేటర్లలోకి రాబోతున్న నాలుగు పెద్ద సినిమాల నిర్మాతలకు రాజమౌళి బృందం ప్రస్తుతం కాల్స్ చేస్తోందని టాలీవుడ్ లో ఓ టాక్ నడుస్తోంది. తమ మూవీ కూడా సంక్రాంతి బరిలోకి వస్తోందని… […]

Written By: , Updated On : September 3, 2021 / 02:16 PM IST
Follow us on

Mahesh compromised for Rajamouli

Rajamouli, Mahesh: ఈ సంక్రాంతి 2022 బరిలో ఇప్పటికే నాలుగు పెద్ద సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. రాజమౌళి అక్టోబర్ 13న తన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రకటించడంతో మిగతా అగ్రహీరోలంతా సంక్రాంతికి ఖర్చీఫ్ వేసేశారు. ‘ఆర్ఆర్ఆర్’ పోటీపడకూడదనే ఇలా దూరంగా జరిగారు.

అయితే సంక్రాంతి 2022లో థియేటర్లలోకి రాబోతున్న నాలుగు పెద్ద సినిమాల నిర్మాతలకు రాజమౌళి బృందం ప్రస్తుతం కాల్స్ చేస్తోందని టాలీవుడ్ లో ఓ టాక్ నడుస్తోంది. తమ మూవీ కూడా సంక్రాంతి బరిలోకి వస్తోందని… దీంతో మీ సినిమాలకు ఎఫెక్ట్ అవుతుందని.. ‘ఆర్ఆర్ఆర్’తో పోటీపడకుండా పక్కకు తప్పుకోవాలని సదురు నిర్మాతలను కోరుతున్నట్టు తెలిసింది.

‘సర్కారి వారి పాట’ నిర్మాతలకు ఈ సమాచారం అందిన తర్వాత హీరో మహేష్ బాబు తన సినిమాను పండుగ సీజన్ నుంచి తీసివేయడానికి అంగీకరించినట్టు సమాచారం. రాజమౌళి తన సినిమా కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే వరకూ ఎలాంటి విడుదల ప్రణాళికలను ప్రకటించవద్దని హీరో మహేష్ బాబు నిర్మాతలను కోరినట్టు తెలిసింది.

రాజమౌళి విషయంలో మహేష్ బాబు వెనక్కి తగ్గడానికి బలమైన కారణంగా ఉంది. ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతోనే రాజమౌళి ప్రకటించాడు. అందుకే రాజమౌళి కోరగానే మహేష్ బాబు తన సినిమాను వాయిదా వేయడానికి అంగీకరించినట్టు సమాచారం. వేరే ఏ దర్శకుడు , నిర్మాత అయితే ఇలా ప్రతిపాదన తెస్తే మహేష్ బాబు వాయిదా వేయడానికి అస్సలు అంగీకరించేవాడు కాదు.. రాజమౌళితో సాన్నిహిత్యం కోసమే వాయిదాకు అంగీకరించాడని తెలిసింది.

గత సంక్రాంతి సీజన్ లో అయితే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి మధ్య రిలీజ్ విషయంలో పెద్ద గొడవ జరిగింది. త్రివిక్రమ్ తో మహేష్ పెద్ద వివాదమే పెట్టుకున్నట్టు టాక్. రెండు సినిమాలు విడుదలకు వెనక్కి తగ్గకపోవడంతో ఒకేసారి విడుదలయ్యాయి. మహేష్ బాబు నాడు వెనక్కి తగ్గమని కోరినా అస్సలు తగ్గకుండా రిలీజ్ చేశాడు. కానీ ఇప్పుడు రాజమౌళి కోసం ఏకంగా తన సినిమాను వాయిదా వేసేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ప్రస్తుతం ‘సర్కారివారి పాట’ చేస్తున్న మహేష్ బాబు ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఆ తర్వాత రాజమౌళి చిత్రాన్ని ప్రారంభిస్తాడు.