https://oktelugu.com/

చెన్నైలో ఇంగ్లండ్ చిత్తు.. ఇండియా గెలుపులో ట్విస్ట్ ఇదే..

తొలి టెస్టులో ఓటమికి అంతే స్థాయిలో.. అదే తీవ్రతతో.. అంతే తేడాతో ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా.. చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. అలా ఇలా కాదు. ఏకంగా 317 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్ అశ్విన్ సెంచరీ సాధించడంతో టీమిండియా 482 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. దీంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ భారత్ కు పోటీ ఇవ్వలేక చతికిలపడింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 16, 2021 / 03:04 PM IST
    Follow us on

    తొలి టెస్టులో ఓటమికి అంతే స్థాయిలో.. అదే తీవ్రతతో.. అంతే తేడాతో ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా.. చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. అలా ఇలా కాదు. ఏకంగా 317 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

    రెండో ఇన్నింగ్స్ అశ్విన్ సెంచరీ సాధించడంతో టీమిండియా 482 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. దీంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ భారత్ కు పోటీ ఇవ్వలేక చతికిలపడింది.

    ముఖ్యంగా అశ్విన్, అక్షర్ పటేల్ ద్వయం బంతిని స్పిన్ పిచ్ పై గింగిరాలు తిప్పుతూ ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ బెంబేలెత్తించారు. 53 పరుగులకే నిన్న 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు నాలుగో రోజు ఈరోజు ఆట ఆరంభించింది. అశ్విన్, అక్షర్ ల ధాటికి వికెట్లను వరుసగా కోల్పోయింది.

    రూట్ 33, బెన్ స్టోక్స్ 8, లారెన్స్, పోప్ 12 పరుగులు చేసి తక్కువకే వరుసగా ఔట్ కావడంతో లంచ్ లోనే ఇంగ్లండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయింది. లంచ్ తరువాత మెయిన్ అలీ 18 బంతుల్లోనే 43 పరుగుల చేసి సిక్సర్లతో హోరెత్తించాడు. దీంతో ఓటమి తప్పదని తెలిసినా కాస్త మెరుగైన స్కోరును ఇంగ్లండ్ సాధించేలా చేశాడు.

    కులదీప్ బౌలంగ్ లో మొయిన్ అలీ అవుట్ కావడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 164 పరుగులకు ముగిసింది. ఇండియాకు ఏకంగా 317 పరుగుల భారీ విజయం సొంతమైంది. రెండో ఇన్నింగ్స్ లో అక్షర్ 5 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లతో రాణించారు.

    ఇక రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడంతోపాటు మొత్తం 8 వికెట్లు తీసిన అశ్విన్ కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.