మాటలకందని విషాదం.. 37మంది ప్రాణాలు జలసమాధి

వరుస రోడ్డు ప్రమాదాలు తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఏపీలోని అరకులో బస్సు బోల్తా పడి ఇటీవలే పలువురు మరణించారు. ఆ వార్త మరువక ముందే కర్నూలులో దారుణ ప్రమాదం 18 మందికిపై మరణానికి కారణమైంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో పెను విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలోని పట్నా గ్రామంలో బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 37మంది మృతిచెందారు. బస్సు పూర్తిగా కాల్వలో మునిగిపోవడంతో పలువురు గల్లంతయ్యారు. ఘటన సమయంలో […]

Written By: NARESH, Updated On : February 16, 2021 3:17 pm
Follow us on

వరుస రోడ్డు ప్రమాదాలు తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఏపీలోని అరకులో బస్సు బోల్తా పడి ఇటీవలే పలువురు మరణించారు. ఆ వార్త మరువక ముందే కర్నూలులో దారుణ ప్రమాదం 18 మందికిపై మరణానికి కారణమైంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో పెను విషాదం చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలోని పట్నా గ్రామంలో బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 37మంది మృతిచెందారు. బస్సు పూర్తిగా కాల్వలో మునిగిపోవడంతో పలువురు గల్లంతయ్యారు.

ఘటన సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు 37 మృతదేహాలు వెలికితీశారు. ఇందులో 16మంది మహిళలు, 20 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్టు గుర్తించారు. ఏడుగురిని రక్షించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో మహిళలే అధికంగా ఉన్నారు. మృతులకు మధ్యప్రదేశ్ సీఎం రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. మోడీ, రాష్ట్రపతి, సంతాపం తెలిపారు. అమిత్ షా మధ్యప్రదేశ్ పర్యటన కూడా రద్దయ్యింది.