కేసీఆర్ కు టాలీవుడ్ స్టార్స్.. భారీ గిఫ్ట్..

దేవుడికి పూజలు చేసిన అర్చకుడి కన్నా.. భజన చేసే భక్తులంటేనే ప్రేమ ఎక్కువ అంటారు. దూప, దీప నైవేద్యాలు సమర్పించే అర్చకుడు ఏనాడూ.. చిన్న కోరిక కూడా తనకోసం కోరడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అలాంటిదే జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో పెద్దలు ఏదైనా పిలుపునిస్తే.. టాలీవుడ్ స్టార్స్ మొత్తం పులకించిపోతారు. తామంటే తాము ముందున్నట్లు ప్రకటనలు వీడియోలు విడుదల చేస్తారు. సాధారణంగా ఏపీ సంతోష్ లాంటి వారి పుట్టిన రోజులకే.. మెగాస్టార్ స్పందిస్తూ ఉంటే.. ఇక కేసీఆర్ […]

Written By: Srinivas, Updated On : February 16, 2021 2:34 pm
Follow us on


దేవుడికి పూజలు చేసిన అర్చకుడి కన్నా.. భజన చేసే భక్తులంటేనే ప్రేమ ఎక్కువ అంటారు. దూప, దీప నైవేద్యాలు సమర్పించే అర్చకుడు ఏనాడూ.. చిన్న కోరిక కూడా తనకోసం కోరడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అలాంటిదే జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో పెద్దలు ఏదైనా పిలుపునిస్తే.. టాలీవుడ్ స్టార్స్ మొత్తం పులకించిపోతారు. తామంటే తాము ముందున్నట్లు ప్రకటనలు వీడియోలు విడుదల చేస్తారు. సాధారణంగా ఏపీ సంతోష్ లాంటి వారి పుట్టిన రోజులకే.. మెగాస్టార్ స్పందిస్తూ ఉంటే.. ఇక కేసీఆర్ పుట్టిన రోజుకు స్పందించకపోవడం వింతే అవుతుంది.

Also Read: టీడీపీ వర్సెస్ నిమ్మగడ్డ..?

పై ఈసారి ప్రతీ ఏటకన్నా.. చాలా భిన్నంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నిర్వహించబోతున్నారు. ఇందుకు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. ఆయన పుట్టినరోజు గుర్తుగా.. కోటి మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నారు.దీని గురించి టాలీవుడ్ పెద్దలకు తెలిసిందో లేదో.. ఇలా పిలుపునివ్వాలని అధికార పార్టీల పెద్దల నుంచి సందేశం వచ్చిందో లేదో.. కానీ.. వరుసగా ఒకరి తరువాత ఒకరు.. వీడియోలు విడుదల చేస్తున్నారు.

చిరంజీవి, నాగార్జున ఈ లిస్టులో ముందు వరుసలో ఉన్నారు. వీరిద్దరే… ఇటీవలి కాలంలో కేసీఆర్ సర్కారుతో ఎక్కువ ర్యాపో మేయింటెన్స్ చేస్తున్నారు.దీంతో వారు కేసీఆర్ పుట్టిన రోజున కోటి మొక్కలు నాటడాన్ని ప్రమోట్ చేయడం తమ బాధ్యతగా భావించినట్లుగా ఉన్నారు. అందుకే వీడియోలు విడుదల చేశారు. సినీ నటీ.. రోజా.. వైసీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ.. వీడియో విడుదల చేశారు.

Also Read: టీడీపీని భయపెడుతున్న మున్సిపల్ ఎన్నికలు..?

అలా వీడియోలు విడుదల చేసేవారికి తెలంగాణ ప్రభుత్వ పెద్దల్లో ప్రత్యేక గుర్తింపు ఉంటుందనడంలో సందేహం లేదు. అలాంటి అవకాశాన్ని ఎవరూ వదులుకోరు. అయితే కోటి మొక్కలు నాటడం అన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. ఒక్క తెలంగాణలో సాధ్యం కాదు కాబట్టి.. యాబై దేశాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి.. నాగార్జున పిలుపుమేరకు ఎంత మంది మొక్కలు నాటుతారో తెలియదు కానీ.. మొక్కలు నాటాలనే సంకేతాలు మాత్రం ఇప్పటికే అభిమానుల ఫోన్లలోకి వెళ్లాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్