చెన్నై టెస్ట్ రసవత్తరం: ఇంగ్లండ్ 134 ఆలౌట్.. భారత్ 195 లీడ్

చెన్నై టెస్ట్ రసవత్తరంగా మారింది. ఏదో ఒక జట్టు గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ చేతులెత్తేయడంతో భారత్ ఈ టెస్ట్ పై పట్టుబిగింది. రెండో రోజులోనే ఆట మూడో ఇన్నింగ్స్ కు దారితీయడంతో మూడు రోజులు మిగిలి ఉన్న ఈ ఆటలో ఫలితం భారత్ కు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. పూర్తి స్పిన్ కు అనుకూలంగా మారిన చెన్నై పిచ్ పై బ్యాటింగ్ కష్టంగా మారింది. దీంతో […]

Written By: NARESH, Updated On : February 14, 2021 4:27 pm
Follow us on

చెన్నై టెస్ట్ రసవత్తరంగా మారింది. ఏదో ఒక జట్టు గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ చేతులెత్తేయడంతో భారత్ ఈ టెస్ట్ పై పట్టుబిగింది. రెండో రోజులోనే ఆట మూడో ఇన్నింగ్స్ కు దారితీయడంతో మూడు రోజులు మిగిలి ఉన్న ఈ ఆటలో ఫలితం భారత్ కు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది.

పూర్తి స్పిన్ కు అనుకూలంగా మారిన చెన్నై పిచ్ పై బ్యాటింగ్ కష్టంగా మారింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 329 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. అయితే భారత్ ను ఔట్ చేసి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ కుప్పకూలారు. భారత బౌలర్ధ ధాటికి రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 52 ఓవర్లలో 195 పరుగులకే   కుప్పకూలింది.

ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ లలో ఒక్క బెన్ ఫోక్స్ మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి అండగా నిలిచేవారే కరువయ్యారు.

ఇక టీమిండియా బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లతో సత్తాచాటాడు. ఇషాంత్ శర్మ, , అక్షర్ పటేల్ లు చెరో రెండు వికెట్లు తీసి సహకరించారు. ఇంగ్లండ్ 134 పరుగులకే కుప్పకూలడంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 195 పరుగుల ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు మరో 200 పరుగులు చేసినా 400 స్కోరును ఛేధించడం ఇంగ్లండ్ కు కష్టం. చివరి రెండు రోజులు భారత భౌలర్లను కాచుకొని నిలబడడం కష్టమే. దీంతో రెండో టెస్టులో ఎటుచూసిన ఇండియా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.