https://oktelugu.com/

ఉప్పెన హీరోయిన్ వ‌య‌సు తెలుసా..? మ‌రీ ఇంత చిన్న పిల్లా..!

వెండి తెర‌పైకి చాలా మంది చినుకులా వ‌స్తారు.. ఆ త‌ర్వాత మెల్ల మెల్ల‌గా ప్ర‌భావం చూపుతూ తుఫానులా మారుతారు! కానీ.. కృతిశెట్టి రావ‌డం రావ‌డ‌మే ‘ఉప్పెన’‌లా దూసుకొచ్చింది. తెలుగు హీరోయిన్లను అతలా కుతలం చేస్తోంది! ఇప్పుడు ఈ క‌న్న‌డ బ్యూటీ రేంజ్ మామూలుగా లేదు. ‘ఈ హీరోయిన్ ను మీ సినిమాల్లో ముందుగానే బుక్ చేసుకోండి.. ఉప్పెన రిలీజ్ అయితే మాత్రం ఈ అమ్మాయి డేట్స్ దొరకవు’ అన్నారు చిరంజీవి. ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా […]

Written By:
  • Rocky
  • , Updated On : February 14, 2021 / 03:36 PM IST
    Follow us on


    వెండి తెర‌పైకి చాలా మంది చినుకులా వ‌స్తారు.. ఆ త‌ర్వాత మెల్ల మెల్ల‌గా ప్ర‌భావం చూపుతూ తుఫానులా మారుతారు! కానీ.. కృతిశెట్టి రావ‌డం రావ‌డ‌మే ‘ఉప్పెన’‌లా దూసుకొచ్చింది. తెలుగు హీరోయిన్లను అతలా కుతలం చేస్తోంది! ఇప్పుడు ఈ క‌న్న‌డ బ్యూటీ రేంజ్ మామూలుగా లేదు.

    ‘ఈ హీరోయిన్ ను మీ సినిమాల్లో ముందుగానే బుక్ చేసుకోండి.. ఉప్పెన రిలీజ్ అయితే మాత్రం ఈ అమ్మాయి డేట్స్ దొరకవు’ అన్నారు చిరంజీవి. ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా మెగాస్టార్ చెప్పిన ఈ మాటలు.. ఇప్పుడు అక్షరాలా నిజం అవుతున్నాయి.

    Also Read: హీరోయిన్ పెళ్లి వార్తలన్నీ రూమర్సే !

    ఉప్పెన సినిమాలో కృతిశెట్టి అద్భుత‌మైన సౌంద‌ర్యంతోపాటు.. అంత‌కు మించిన అభినయంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అస‌లే.. ల‌వ్ స్టోరీ. అందులోనూ.. పెయిన్ ఫుల్ ప్రేమ‌క‌థ‌. ఈ సినిమాలో ఈ చిన్న‌ది ఏకంగా జీవించేయ‌డంతో.. యూత్ ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు.

    ‘ఉప్పెన’ టాక్ తో ఇప్పుడు ఈ భామ డేట్స్ బంగారం అయిపోతున్నాయి. దర్శక, నిర్మాతలు కృతి డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో.. రెండో సినిమాకే ఈ బేబీ రూ.75 లక్షల వరకు రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తోందట‌! ఇదిలా ఉంటే.. పాల బుగ్గ‌ల‌తో మెరిసిపోతున్న కృతి వ‌య‌సు ఎంత అనే చ‌ర్చ గ‌ట్టిగానే జ‌రుగుతోంది. సోషల్ మీడియాలో ఈ డిస్క‌ష‌న్ ఎక్కువ‌గా ఉంది.

    Also Read: క‌లెక్ష‌న్ల‌ ‘ఉప్పెన‌’.. నెంబ‌ర్ 1 హీరోగా వైష్ణ‌వ్..!

    అయితే.. వాస్త‌వం కూడా అదే. కృతిశెట్టి వయసు కేవలం 17 సంవ‌త్స‌రాలు మాత్రమే. 2003లో జన్మించిన‌ కృతి.. ప్ర‌స్తుతం ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతోంది. ఉప్పెన సినిమాకు ముందు ప‌లు యాడ్స్ లో న‌టించింది కృతి. అలా.. సినిమా ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. ఉప్పెన విజ‌యంతో వెండితెర‌పై సునామీ సృష్టించ‌బోతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్