గతేడాది బంగారం ధరలు భారీగా పెరగడంతో పాటు కొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు అంతకంతకూ తగ్గుతుండగా ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 500 రూపాయలు తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలని భావించేవాళ్లకు పసిడి కొనుగోలుకు ఇదే సరైన సమయమని చెప్పవచ్చు.
Also Read: నాలుగో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గాయంటే..?
ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 500 రూపాయలు తగ్గి రూ.48,290గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250గా ఉంది. హైదరాబాద్ నగరంలో ఈ విధంగా బంగారం రేట్లు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం బంగారం ధర 50,000 రూపాయల మార్కును దాటింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.46,400గా ఉంది.
Also Read: చైనానే సూపర్ యాప్ లు ఎందుకు తయారు చేస్తోంది..?
బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా తగ్గడం గమనార్హం. గడిచిన రెండు రోజుల్లో వెండి ధర ఏకంగా 1,100 రూపాయలు తగ్గడంతో కిలో వెండి 73,300 రూపాయలకు చేరింది. రోజురోజుకు పరిశ్రమ యూనిట్ల నుంచి, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గుతూ ఉండటంతో వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పవఛ్చు. వేర్వేరు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని చెప్పవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: వ్యాపారము
కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న బంగారం నిల్వలు, వడ్డీరేట్లు, కరోనా వ్యాక్సిన్, వినియోగదారుల నుంచి డిమాండ్, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం ఇలా వేర్వేరు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.