505కు చేరిన ఏలూరు బాధితులు.. వింతవ్యాధికి కారణమిదే..

కరోనాతోనే సగం చచ్చాం.. ఇప్పుడు ఈ వింత వ్యాధితో ఏపీలోని ఏలూరు వణుకుతోంది. భిక్కుభిక్కుమంటూ గడుపుతోంది. ఎప్పుడు, ఎవరు ఆస్పత్రి పాలవుతున్నారో తెలియడం లేదు. ఏలూరులో ఎక్కడ చూసినా ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది. అంబులెన్స్ ల సైరెన్లు, బాధితుల ఆర్తనాదాలతో ఏలూరులో భీతావాహ వాతావరణం నెలకొంది. Also Read: భారత్ బంద్.. వాహనదారులను అలర్ట్ చేస్తున్న పోలీసులు..! పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వింత రోగానికి ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు […]

Written By: NARESH, Updated On : December 8, 2020 11:13 am
Follow us on

కరోనాతోనే సగం చచ్చాం.. ఇప్పుడు ఈ వింత వ్యాధితో ఏపీలోని ఏలూరు వణుకుతోంది. భిక్కుభిక్కుమంటూ గడుపుతోంది. ఎప్పుడు, ఎవరు ఆస్పత్రి పాలవుతున్నారో తెలియడం లేదు. ఏలూరులో ఎక్కడ చూసినా ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది. అంబులెన్స్ ల సైరెన్లు, బాధితుల ఆర్తనాదాలతో ఏలూరులో భీతావాహ వాతావరణం నెలకొంది.

Also Read: భారత్ బంద్.. వాహనదారులను అలర్ట్ చేస్తున్న పోలీసులు..!

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వింత రోగానికి ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది.

ఇప్పటివరకు ఆస్పత్రిలో చేరిన వారిసంఖ్య 505కు చేరింది. వీరిలో 330 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దాదాపు 153మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గుంటూరు, విజయవాడ ఆస్పత్రులకు 19మంది పరిస్థితి విషమించడంతో తరలించారు. ఇప్పటికే అంతుచిక్కని ఈ వ్యాధికి ఒకరు మృతి చెందారు. బాధితులలో 271 మంది పురుషులు కాగా.. 235మంది స్త్రీలు ఉన్నారు.

Also Read: తిరుపతి బైపోల్: పవన్, బీజేపీ పొత్తు పొడిచేలా లేదే?

బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా సోమవారం సీఎం జగన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను, బాధితులను పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

కాగా ఏలూరులో ఇలా ప్రజలు అస్వస్థతకు గురికావడానికి ‘లెడ్ హెవీ మెటల్’ కారణం అని పరీక్షల్లో తేలినట్టు బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు తెలిపారు. రోగుల రక్త నమూనాల్లో ఈ ‘లెడ్’ హెవీ మెటల్, నికెల్ అనే మెటల్ ఉన్నట్టు ఢిల్లీలోని ఎయిమ్స్ నిర్వహించిన పరీక్షల్లో తేలిందని ఆయన తెలిపారు. దీనివల్ల నరాలపై ప్రభావం చూపి మూర్చ కళ్లు తిరిగి పడిపోతారని తెలిపారు.

లెడ్ అనేది బ్యాటరీల్లో వాడుతారు. ఇది తాగునీటి ద్వారా లేదా పాల ద్వారా రోగుల శరీరంలోకి వెళ్లి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్