తెల్ల జుట్టును నల్లగా మార్చటానికి పాటించాల్సిన చిట్కాలివే..?

ఈ మధ్య కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి, జన్యుపరమైన సమస్యలు, ఇతర కారణాల వల్ల చాలామందికి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది. జుట్టు తెల్లబడటం చిన్న సమస్యే అయినా ఈ సమస్య వల్ల చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు. ఈ సమస్య వల్ల చిన్న వయస్సులోనే పెద్ద వయస్సు వారిలా కనిపిస్తున్నామని ఆందోళన పడుతున్నారు. జుట్టు క్రింది భాగంలో ఉండే మెలనోసైట్ల్స్ జుట్టు యొక్క రంగుకు కారణమవుతాయి. Also Read: మైగ్రేన్ తలనొప్పిని సులువుగా తగ్గించే చిట్కాలివే..? […]

Written By: Navya, Updated On : December 8, 2020 11:38 am
Follow us on


ఈ మధ్య కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి, జన్యుపరమైన సమస్యలు, ఇతర కారణాల వల్ల చాలామందికి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది. జుట్టు తెల్లబడటం చిన్న సమస్యే అయినా ఈ సమస్య వల్ల చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు. ఈ సమస్య వల్ల చిన్న వయస్సులోనే పెద్ద వయస్సు వారిలా కనిపిస్తున్నామని ఆందోళన పడుతున్నారు. జుట్టు క్రింది భాగంలో ఉండే మెలనోసైట్ల్స్ జుట్టు యొక్క రంగుకు కారణమవుతాయి.

Also Read: మైగ్రేన్ తలనొప్పిని సులువుగా తగ్గించే చిట్కాలివే..?

శరీరంలో ఉండే మెలానిన్ స్థాయిలను బట్టి జుట్టు రంగులలో మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్యతో బాధ పడే వాళ్లు కరివేపాకు, మందారం, గోరింటాకు తీసుకుని మూడింటినీ రుబ్బి తలకు పట్టిస్తే తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది. గుంటగలగరాకు, పొన్నగంటి కూర, కరివేపాకును రుబ్బి తలకు రాసినా కూడా జుట్టు క్రమంగా నల్లబడుతుంది. కొంతమందికి విటమిన్ల లోపం వల్ల తెల్లజుట్టు సమస్య వస్తుంది.

Also Read: మధుమేహ రోగులు శనగలు తినవచ్చా..? తినకూడదా..?

బీ12 విటమిన్ లోపం, కాపర్, ఐరన్ లోపం, డి విటమిన్ లోపం జుట్టు తెల్లబడటానికి కారణమవుతాయి. ఒత్తిడి, హెయిర్ స్టైలింగ్ కోసం వాడే ఉత్పత్తులు సైతం జుట్టు తెల్లబడటానికి కారణమవుతాయి. కొబ్బరి నూనెను వేడి చేసి అందులో కరివేపాకు వేసి తలకు పట్టించినా మంచి ఫలితాలు ఉంటాయి. తులసి ఆకులను నీటిలో వేసి కాచి చల్లార్చిన నీటిని తలకు పట్టించినా జుట్తు నల్లబడి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

ఈ టిప్స్ అన్నీ పాటించినా తెల్లజుట్టు నల్లగా మారకపోతే వైద్యులను సంప్రదించి జుట్టు సమస్యకు గల కారణం తెలుసుకోవాలి. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడితే ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.