టీవీ, ఫ్రిజ్ కొనాలనుకునే వాళ్లకు షాకింగ్ న్యూస్..?

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కిన సంగతి తెలిసిందే. ఆదాయం అంతకంతకూ తగ్గుతుండటం, ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలు కోసం ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే టీవీ, ఫ్రిజ్ కొనాలనుకునే వాళ్లకు భారీ షాక్ తగలబోతుంది. టీవీ, ఫ్రిజ్, ఏసీ లాంటి వైట్‌ గూడ్స్‌ ధరలు త్వరలో 20 శాతం పెరగనున్నాయని సమాచారం. Also Read: రక్తదానం చేస్తే కేజీ చికెన్ […]

Written By: Kusuma Aggunna, Updated On : December 8, 2020 11:52 am
Follow us on


కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కిన సంగతి తెలిసిందే. ఆదాయం అంతకంతకూ తగ్గుతుండటం, ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలు కోసం ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే టీవీ, ఫ్రిజ్ కొనాలనుకునే వాళ్లకు భారీ షాక్ తగలబోతుంది. టీవీ, ఫ్రిజ్, ఏసీ లాంటి వైట్‌ గూడ్స్‌ ధరలు త్వరలో 20 శాతం పెరగనున్నాయని సమాచారం.

Also Read: రక్తదానం చేస్తే కేజీ చికెన్ ఫ్రీ.. ఎక్కడంటే..?

ఉత్పత్తి, రవాణా వ్యయాలు భారీగా పెరగడంతో కంపెనీలు ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గడిచిన 5 నెలల్లో వైట్ గూడ్స్ ఉత్పత్తి వ్యయం దాదాపు 30 శాతం పెరిగింది. వైట్ గూడ్స్ తయారీలో రాగి, జింక్ లాంటి మెటల్స్ ను ఎక్కువగా వినియోగిస్తారు. వీటి ధరలు పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కంపెనీలు సైతం ధరలను పెంచక తప్పట్లేదు. గత కొన్నేళ్లలో ఎప్పుడూ పెరగని విధంగా వైట్ గూడ్స్ ధరలు పెరగనున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: తిప్పతీగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

గతంలోనే టీవీ, ఫ్రిజ్, ఇతర వైట్ గూడ్స్ ధరలు పెరగాల్సి ఉన్నా కరోనా విజృంభణ వల్ల అమ్మకాలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో కంపెనీలు ఆ దిశగా అడుగులు వేయలేదు. పండుగ సీజన్ పూర్తైన నేపథ్యంలో కంపెనీలు ధరల పెంపుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వైట్‌ గూడ్స్‌ ధరలను పెంచడం సరికాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

2021 జనవరి నెల నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ధరలు పెరిగితే మార్చి క్వార్టర్‌ లో అమ్మకాల్లో తగ్గుదల నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం ఎల్‌ఈడీ/ఎల్‌సీడీ స్క్రీన్ల తయారీలో వినియోగించే ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరలను పెంచనుండటంతో టీవీల ధరలు సైతం అమాంతం పెరగనున్నాయని తెలుస్తోంది.