https://oktelugu.com/

జీహెచ్ఎంసీలో ఎగ్జిట్ పోల్స్ కు ఈసీ బ్రేకులు.. ఏమైందంటే?

శరామామూలుగానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పడిపోయింది. ఈసారి 5 గంటలకు 36.73శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం వరకు 42శాతం వరకు నమోదైనట్టు తెలుస్తోంది. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 42.09శాతం పోలింగ్ నమోదైంది. 2016లో 45.29శాతం మంది నమోదైంది. ఈసారి 42శాతానికే పరిమితమైనట్టు తెలుస్తోంది. ఈసీ ప్రకటించాల్సి ఉంది. Also Read: జీహెచ్ఎంసీలో అత్యల్ప పోలింగ్: ఎవరికి అనుకూలం? గ్రేటర్‌లోని 150 డిజిన్లలో ఇవాళ పోలింగ్ జరగాల్సి ఉండగా.. ఒకే తప్పుతో ఓ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2020 / 10:16 PM IST
    Follow us on

    శరామామూలుగానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పడిపోయింది. ఈసారి 5 గంటలకు 36.73శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం వరకు 42శాతం వరకు నమోదైనట్టు తెలుస్తోంది. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 42.09శాతం పోలింగ్ నమోదైంది. 2016లో 45.29శాతం మంది నమోదైంది. ఈసారి 42శాతానికే పరిమితమైనట్టు తెలుస్తోంది. ఈసీ ప్రకటించాల్సి ఉంది.

    Also Read: జీహెచ్ఎంసీలో అత్యల్ప పోలింగ్: ఎవరికి అనుకూలం?

    గ్రేటర్‌లోని 150 డిజిన్లలో ఇవాళ పోలింగ్ జరగాల్సి ఉండగా.. ఒకే తప్పుతో ఓ డివిజన్‌లో పోలింగ్ వాయిదా పడింది. దీంతో.. వాయిదా పడిన ఓల్డ్‌ మలక్‌పేట్ డివిజన్‌లో మళ్లీ పోలింగ్ నిర్వహించనున్నట్టు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.. ఇదే సమయంలో మరో ప్రకటన జారీ చేసింది… రేపు ఓల్డ్ మలక్‌పేట్‌లో పోలింగ్ జరగనున్నందున.. ఈరోజు ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం ఉంటుందని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

    పోలింగ్ శాతం తగ్గడంతో ఏ పార్టీ విజ‌యం సాధిస్తుంది.? ఎవ‌రు గెలుస్తారు.? ఏ పార్టీ ఓట‌మి పాల‌వుతుంద‌నేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తడానికి రెడీ కాగా ఆగిపోయింది. గ్రేటర్ ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. ప్రతి ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్ గురించి ఎదురుచూస్తుంటారు. విష‌యాల‌ను వివిధ న్యూస్ ఛానెల్స్, సంస్థలు, స‌ర్వేలను బ‌య‌ట‌పెడుతాయి. రీ పోలింగ్‌ ఉండటంతో ఎగ్జిట్‌ పోల్స్‌ను ఎస్‌ఈసీ నిషేధించింది. మరోవైపు, పలు చోట్ల ఉద్రిక్తతల మధ్య పోలింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలకు దిగడంతో ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

    Also Read: ముగిసిన జీహెచ్ఎంసీ పోలింగ్: ఈసారి ఎంత తక్కువ ఓటింగ్ శాతమంటే?

    ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్‌ పత్రంలో సీపీఐ పార్టీ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఎం పార్టీ గుర్తు ముద్రించారు. దీంతో పోలింగ్‌ నిలిపివేయాలంటూ సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు.

    కాగా, గ్రేటర్ 26వ డివిజన్ అయిన ఓల్డ్ మలక్‌పేట్‌లో కంకి కొడవలి (సీపీఐ)కి బదులుగా… సుత్తి కొడవలి (సీపీఎం) గుర్తులను ముద్రించింది ఎన్నికల కమిషన్‌.. అయితే, దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది సీపీఐ.. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు ఆ పార్టీ నేత చాడ వెంకట్‌రెడ్డి. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్‌, అక్కడ ఎన్నికలు రద్దు చేస్తూ ప్రకటించింది. దీనిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ఎస్‌ఈసీ… రేపు (బుధవారం) ఓల్డ్ మలక్ పేట డివిజన్‌లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది.. ఆ తర్వాతే ఎగ్జిట్ పోల్స్ బయటకు రానున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్