https://oktelugu.com/

ఎంఐఎం టార్గెట్ 40.. సాధ్యమవుతుందా?

గ్రేటర్ పోలింగ్ ముగిసింది. ఒక డివిజన్ రీపోలింగ్ మినహా అంతా పూర్తయ్యింది. పోలింగ్ శాతం అత్యల్పంగా నమోదు కావడంతో అధికార టీఆర్ఎస్ కు వేవ్ ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే ఢిల్లీ నుంచి వచ్చి అతిరథ బీజేపీ పెద్దల మేనియా ఉందని.. బీజేపీకి సీట్లు వస్తాయన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఓటరు నాడి మాత్రం అంతుబట్టడం లేదు. టీఆర్ఎస్ కు, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది ఖచ్చితంగా చెప్పడానికి ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి ఉంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2020 / 10:35 PM IST
    Follow us on

    గ్రేటర్ పోలింగ్ ముగిసింది. ఒక డివిజన్ రీపోలింగ్ మినహా అంతా పూర్తయ్యింది. పోలింగ్ శాతం అత్యల్పంగా నమోదు కావడంతో అధికార టీఆర్ఎస్ కు వేవ్ ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే ఢిల్లీ నుంచి వచ్చి అతిరథ బీజేపీ పెద్దల మేనియా ఉందని.. బీజేపీకి సీట్లు వస్తాయన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఓటరు నాడి మాత్రం అంతుబట్టడం లేదు. టీఆర్ఎస్ కు, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది ఖచ్చితంగా చెప్పడానికి ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి ఉంది. అయితే అందరి పరిస్థితి ఇలా ఉంటే ‘పతంగి’ పార్టీ ఎంఐఎంకు గన్ షాట్ గా సీట్లు వస్తాయని అందరిలోనూ ధీమా ఉంది. ఎందుకంటే ఆ వర్గం వారు ఖచ్చితంగా వారికే వేస్తారనే ధీమా ఉంది.

    Also Read: జీహెచ్ఎంసీలో ఎగ్జిట్ పోల్స్ కు ఈసీ బ్రేకులు.. ఏమైందంటే?

    మజ్లిస్ పార్టీ మొత్తం 51 డివిజన్లలో పోటీచేస్తోంది. ఇందులో 40 స్థానాలు గెలవాలన్నది ఎంఐఎం టార్గెట్ . ఇక అన్ని కూడా ఖచ్చితంగా గెలుస్తామన్న స్థానాలనే ఎంఐఎం టార్గెట్ గా పెట్టుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందన్న ముద్రను ఎక్కడా రాకుండా చూసుకుంది. టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు లేదని ప్రజలకు చెప్పుకొచ్చింది. దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ నేతల నుంచి టీఆర్ఎస్ వ్యతిరేక వ్యాఖ్యలు వినిపించడం విశేషం.

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పెద్ద టార్గెట్ పెట్టుకుంది. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోకున్నా అవగాహనతో ముందుకెళుతున్న ఈ పార్టీ ఇప్పుడు గ్రేటర్ లో అనుకున్న సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రచార పర్వంలో తమదైన వ్యూహాలతో ఎంఐఎం ముందుకు వెళుతోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని సాధిస్తామని ఉవ్విళ్లూరుతున్నారు.

    Also Read: జీహెచ్ఎంసీలో అత్యల్ప పోలింగ్: ఎవరికి అనుకూలం?

    పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టింది. గతంలో కంటే భిన్నంగా ప్రచారం చేసిన ఎంఐఎం.. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందన్న ముద్రను ఎక్కడా కూడా రాకుండా చూసుకుంది.అందుకే ఈసారి 40 నుంచి 50 సీట్లు పక్కాగా ఎంఐఎంకు వస్తాయన్న ధీమా ఆ పార్టీలో ఉంది. హిందుత్వ ఓటింగ్ బీజేపీకి, ముస్లిం ఓటింగ్ ఎంఐఎంకు ఖచ్చితంగా పడుతుందని.. టార్గెట్ రీచ్ అవుతామని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్