జీహెచ్ఎంసీలో అత్యల్ప పోలింగ్: ఎవరికి అనుకూలం?

ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్ ఎవరి కొంప కూలుస్తుందోనన్న ఆందోళన పార్టీల్లో నెలకొంది. ఈసారి కూడా దాదాపుగా అటూ ఇటూగా 45శాతం మాత్రమే ఓటింగ్ నమోదైనట్టు తెలిసింది. సాయంత్రం 5 గంటల వరకు 35.80 ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటల వరకు 45 శాతం వరకు చేరినట్టు తెలిసింది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. Also Read: బ్యాలెట్ పేపర్.. ఈవీఎంలకు కాలం చెల్లిందా? అయితే విద్యాధికులు, మేధావులు, ఉద్యోగులు, ఉన్న […]

Written By: NARESH, Updated On : December 2, 2020 10:27 am
Follow us on

ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్ ఎవరి కొంప కూలుస్తుందోనన్న ఆందోళన పార్టీల్లో నెలకొంది. ఈసారి కూడా దాదాపుగా అటూ ఇటూగా 45శాతం మాత్రమే ఓటింగ్ నమోదైనట్టు తెలిసింది. సాయంత్రం 5 గంటల వరకు 35.80 ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటల వరకు 45 శాతం వరకు చేరినట్టు తెలిసింది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Also Read: బ్యాలెట్ పేపర్.. ఈవీఎంలకు కాలం చెల్లిందా?

అయితే విద్యాధికులు, మేధావులు, ఉద్యోగులు, ఉన్న మెట్రో పాలిటన్ సిటీలో ఇంత తక్కువ శాతం ఓటింగ్ నమోదు కావడమే అందరినీ షాక్ కు గురిచేస్తున్న అంశం. ఎంత ప్రచారం చేసినా ఓటర్లు ముందుకు రాకపోవడం గమనార్హం.

ఓల్డ్ మలక్ పేటలో రీపోలింగ్ లేకుంటే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో విజేతలు ఎవరనేది తేలేది. కానీ ఈసీ నిషేధం విధించడంతో 3 వ తేదీ వరకు ఎవరిది గెలుపు అనేది అంచనావేయడం కష్టంగా మారింది.

అయితే ఈ అతితక్కువ పోలింగ్ ఎవరికి అనుకూలం..? ఎవరికి ప్రతికూలం అనే చర్చ మొదలైంది. సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి అనుకూలం కాదు అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. ప్రభుత్వాల మీద వ్యతిరేక పెరిగినప్పుడే ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుందనేది ఒక ఖచ్చితమైన అంచనాగా ఉంది. గత ఏపీ ఎన్నికల్లో 80శాతానికి పైగా ఓటర్లు పోటెత్తి జగన్ ను గెలిపించడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.

Also Read: విజయశాంతి దాచేస్తే దాగదుగా? ‘కాషాయ’ ప్రేమ సల్లగుండ?

దీన్ని బట్టి చూస్తుంటే గ్రేటర్ లో 45శాతం కన్నా తక్కువగా పోలింగ్ నమోదు కావడంతో టీఆర్ఎస్ కు అనుకూలం అనే చర్చ సాగుతోంది. అయితే బీజేపీ ఈసారి సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేసింది. ఢిల్లీ లీడర్లందరూ గల్లీకి వచ్చారు. టీఆర్ఎస్ ను చెడుగుడు ఆడారు.

అయినా పోలింగ్ శాతం మునుపటి అంతే నమోదు కావడంతో టీఆర్ఎస్ వైపే మొగ్గు అన్న వాదన వినిపిస్తోంది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేవ్ ఉంటే ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగేదని.. తగ్గిపోవడం చూస్తుంటే ప్రజలు పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో సంప్రదాయ ఓట్లు టీఆర్ఎస్ కే పడొచ్చన్న వాదన వినిపిస్తోంది. అయితే బీజేపీ తేలికగా తీసిపారేయడానికి లేదు అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్