https://oktelugu.com/

తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. దుబ్బాక ఫలితం రిపీట్ కానుందా?

తెలంగాణలో టీఆర్ఎస్ కు హనీమూన్ రోజులు అయిపోయినట్లుగా కన్పిస్తున్నాయి. గత ఆరేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగింది. అయితే దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో తెలంగాణలో ఉప ఎన్నిక వచ్చింది. సాధారణంగా అధికార పార్టీవైపు ఓటర్లంతా మొగ్గుచూపుతుంటారు. కానీ దుబ్బాకలో సీన్ రీవర్స్ అయింది. దీంతో తెలంగాణ టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు మొదలైనట్లు వెల్లడైంది. Also Read: 24 గంటలకు.. జీహెచ్ఎంసీలో పోలింగ్ శాతం ఫైనల్ ఇదీ! దుబ్బాక ఉప ఎన్నిక పోరు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 3, 2020 / 07:30 AM IST
    Follow us on

    తెలంగాణలో టీఆర్ఎస్ కు హనీమూన్ రోజులు అయిపోయినట్లుగా కన్పిస్తున్నాయి. గత ఆరేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగింది. అయితే దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో తెలంగాణలో ఉప ఎన్నిక వచ్చింది. సాధారణంగా అధికార పార్టీవైపు ఓటర్లంతా మొగ్గుచూపుతుంటారు. కానీ దుబ్బాకలో సీన్ రీవర్స్ అయింది. దీంతో తెలంగాణ టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు మొదలైనట్లు వెల్లడైంది.

    Also Read: 24 గంటలకు.. జీహెచ్ఎంసీలో పోలింగ్ శాతం ఫైనల్ ఇదీ!

    దుబ్బాక ఉప ఎన్నిక పోరు హోరాహోరీగా సాగింది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు జరుగగా విజయం మాత్రం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకే దక్కింది. ఈ ఎన్నిక తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలోనూ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ప్రచారం సాగింది. రేపు(డిసెంబర్ 4న) ఫలితాలు రానుండటంతో ఏ పార్టీ గ్రేటర్లో సత్తా చాటనుందో తేలనుంది.

    జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోగానే టీఆర్ఎస్ కు మరో పరీక్ష ఎదురుకానుంది. నాగార్జున్ సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య గుండెపోటుతో హఠార్మణం చెందారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం కూడా టీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం కావడంతో ఈ సీటును టీఆర్ఎస్ ఎలాగైన దక్కించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

    దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో టీఆర్ఎస్ ఈసారి ఆచితూచి వ్యవహరించేలా కన్పిస్తోంది. నాగర్జున్ సాగర్లో టీఆర్ఎస్ తరఫున గట్టి అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలున్నాయి. దీంతో బీజేపీ ఇప్పటి నుంచే నాగార్జున సాగర్లో ఆపరేషన్ ఆకర్ష్ షూరు చేసినట్లు కన్పిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డితో బీజేపీ నేతలు చర్చించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

    Also Read: వైరల్:నోముల నోట ఆఖరి మాటలో కమ్యూనిజం

    రఘువీర్ రెడ్డి కమలం గూటికి చేరితే నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికలో సీటు ఇస్తామని బీజేపీ పెద్దలు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రఘువీర్ రెడ్డి బీజేపీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ కు సైతం చెక్ పెట్టే అవకాశాలున్నాయి. రఘువీర్ పై జానారెడ్డి పోటీచేసే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఆ పార్టీ రేసులో వెనుకబడటం ఖాయంగా కన్పిస్తోంది.

    దీంతో నాగార్జున్ సాగర్లో సైతం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉంది. రఘువీర్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడం ద్వారా అటూ కాంగ్రెస్.. ఇటూ టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని కమల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చే పార్టీ బీజేపీనే కావడంతో రఘువీర్ రెడ్డి సైతం కాషాయం కండువా కప్పుకునే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. అయితే రఘువీర్ హస్తం పార్టీకి హ్యండిచ్చి కమలం గూటికి చేరుతారా? లేదా అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్