పిస్తా పప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పిస్తా పప్పు తింటే మంచిదని సూచిస్తూ ఉంటారు. చాలామంది పిస్తా పప్పు తింటే లావు అవుతామని భయపడుతూ ఉంటారు. కానీ వాస్తవం ఏమిటంటే పిస్తా పప్పు బరువును సులభంగా తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ పిస్తా పప్పు తీసుకునే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ప్రోటీన్లు, అమైనో యాసిడ్లు పుష్కలంగా ఉండే పిస్తా పప్పు తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు సులభంగా కరుగుతుంది. Also […]

Written By: Navya, Updated On : December 3, 2020 1:41 pm
Follow us on


శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పిస్తా పప్పు తింటే మంచిదని సూచిస్తూ ఉంటారు. చాలామంది పిస్తా పప్పు తింటే లావు అవుతామని భయపడుతూ ఉంటారు. కానీ వాస్తవం ఏమిటంటే పిస్తా పప్పు బరువును సులభంగా తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ పిస్తా పప్పు తీసుకునే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ప్రోటీన్లు, అమైనో యాసిడ్లు పుష్కలంగా ఉండే పిస్తా పప్పు తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు సులభంగా కరుగుతుంది.

Also Read: కీళ్ల నొప్పులను సులువుగా తగ్గించుకోవడానికి పాటించాల్సిన చిట్కాలివే..?

పిస్తా పప్పు జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. శాస్త్రవేత్తలు రోజూ పిస్తా పప్పు తినేవాళ్లలో రక్తపోటు అదుపులో ఉంటుందని పరిశోధనల ద్వారా తేల్చారు. కొలోన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడంలో పిస్తా పప్పు సహాయపడుతుంది. క్యాన్సర్ కారక వైరస్ లను పిస్తా పప్పు దూరం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పిస్తా రోజూ తీసుకుంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

Also Read: నిమ్మరసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

ప్రతిరోజూ పిస్తా తీసుకునే వారిలో డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవాలని అనుకునేవారు పిస్తాను డైట్ లో భాగం చేసుకుంటే మంచిది. అల్ట్రా వయొలెట్ లైట్, బ్లూ లైట్ నుంచి కళ్లను రక్షించడంలో పిస్తా పప్పు సహాయపడుతుంది. పిస్తా పప్పు ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్ తో పాటు బి విటమిన్ కూడా లభిస్తుంది.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

పిస్తా పప్పు కంటి సంబంధిత సమస్యలను సైతం తగ్గిస్తుంది. కంటిచూపు మందగించిన వారు పిస్తా పప్పు రోజూ తీసుకోవడం ద్వారా సులభంగా ఆ సమస్యను అధిగమించవచ్చు. పిస్తా పప్పు గుండెజబ్బులను తగ్గించడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో సహాయపడుతుంది.