
చాలా మంది వాహనదారులు చేసే చిన్నచిన్న తప్పులు కొన్ని సందర్భాల్లో వాళ్ల లైసెన్స్ క్యాన్సిల్ కావడానికి కారణమవుతూ ఉంటాయి. కేంద్రం గతేడాది మోటార్ వెహికల్ యాక్ట్ లో సవరణలు చేయడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలలో కీలక మార్పులు చేసి గతంతో పోలిస్తే జరిమానాలను భారీగా పెంచింది. రోజురోజుకు దేశవ్యాప్తంగా వాహనదారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
ఈ నిబంధనల ప్రకారం వాహనదారులు కొన్ని తప్పులు చేస్తే వాళ్ల లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వానదారులు బైక్ లేదా కార్ లేదా ఇతర వాహనాలు డ్రైవ్ చేసే సమయంలో కొన్ని విషయాలను జ్ఞప్తికి ఉంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో వాహనానికి సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించడం కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో పోలీసులకు ఖచ్చితంగా సహకారించాలి.
Also Read: బీహార్ ఎన్నికలు: మోడీ వరాలు.. అక్కడి ప్రజలు నమ్మేనా..!
అలా కాకుండా పోలీసుల విధులకు ఇబ్బంది కలిగించినా, పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించినా లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కొందరు అతివేగంగా బైక్ ను నడపడం, ఇతరులకు గాయాలయ్యేలా వాహనాలను డ్రైవ్ చేయడం చేస్తూ ఉంటారు. ఇలాంటి తప్పులు చేసినా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చెసినా లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది.
Also Read: స్థానిక ఎన్నికలకు వైసీపీ నై.. టీడీపీ సై..కారణమేంటి?
వాహనాల్లో ప్రయాణించే సమయంలో ఇతరుల లగేజ్ బ్యాగులను దొంగలించినా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వాహనదారులు వాహనాలను నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం సేవించి వాహనాలను నడిపినా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు వాహనానికి సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికెట్ వాలిడిటీలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.