Insurance Fraud by Doctor: ఆదాయానికి మించిన ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీంతో డబ్బు అవసరం రోజురోజుకు ఎక్కువవుతుంది. అయితే సక్రమమైన దారిలో వెళ్తే సరైన డబ్బు రావడంలేదని ఉద్దేశంతో కొందరు తప్పుడు దారులు పడుతూ సంపాదించాలని అనుకుంటున్నారు. ఇలా అనుకున్న వారిలో కొందరు సక్సెస్ అవుతుండగా.. మరికొందరు ఇలా ప్రయత్నించి విఫలమవుతున్నారు. తాజాగా ఓ వైద్యుడు అబద్ధం ఆడి ఇన్సూరెన్స్ డబ్బులు దోచేయాలని చూసాడు. కానీ అందుకు సాధ్యం కాలేదు. దీంతో ఆ వైద్యుడు ఆ అబద్దాన్ని నిజం చేసి.. పశ్చాత్తాపానికి గురయ్యాడు. అతడు చెబుతున్న విషయం ఏంటంటే.. తనకు మునుపడి కంటే ఇప్పుడే జీవితం బాగుందని అంటున్నాడు. ఇంతకీ ఆ వైద్యుడు చేసిన తప్పేంటి? తప్పు తెలుసుకొని ఏం చేశాడు?
Also Read: ఇంటర్నెట్ ఉపయోగించేవారికి హెచ్చరిక..
బ్రిటన్ కు చెందిన నెయిల్ హాపర్ అనే వైద్యుడు ఇన్సూరెన్స్ డబ్బులను కాజేయాలని చూశాడు. తనకు ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ద్వారా..రూ.5.4 కోట్లు వస్తాయని భావించాడు. ఇందుకోసం మరణం సంభవించకుండా కాళ్ళను ఎలా తీసివేయాలో ఆన్లైన్లో తెలుసుకున్నాడు. మరో వైద్యుడు సహాయంతో తన కాళ్ళను తీసి వేయించుకున్నాడు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ సంస్థలకు క్లెయిమ్ చేసుకున్నాడు. అయితే ఇన్సూరెన్స్ సంస్థలకు అనుమానం వచ్చింది. దీంతో ఈ క్లెయిమ్ పక్కన పెట్టింది.
Also Read: భారత కరెన్సీ నోట్లపై గాంధీ కన్నా ముందు ఎవరి ఫొటో ఉండేదో తెలుసా.. చరిత్ర ఇదీ
ఇంతలో నెయిల్ హాపర్ మరికొందరిని కూడా ఇలాగే చేయాలని ప్రోత్సహించాడు. ఇందులో గుత్సవ్ సన్ అనే వ్యక్తిని కూడా ఇలాగే చేయమని చెప్పడంతో.. ఆ విషయం బయటకు వచ్చింది. దీంతో నెయిల్ హాపర్ పై కొందరు పిటిషన్లు వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో కొనసాగుతోంది. అయితే పిటిషనర్లు చెబుతున్న ప్రకారం.. నెయిల్ కావాలనే తన కాళ్ళను తీసివేయుంచుకున్నాడని.. మరికొందరిని కూడా ఇలాగే ప్రోత్సహించి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ అతను మాత్రం తన కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చిందని.. వైద్యుల ద్వారా శస్త్ర చికిత్స చేసుకున్న అని చెబుతున్నాడు.
మెయిల్ హోపర్ ఇలా ఇన్సూరెన్స్ సంస్థలను మోసం చేశారని అభియోగాలు రావడంతో అతను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి తొలగించారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు వైద్య వృత్తి కూడా మానేయడంతో మెడికల్ రిజిస్టర్ నుంచి అతని పేరు తీసేశారు. కానీ విచారణలో భాగంగా అతను పనిచేసిన ఆసుపత్రిని సంప్రదించగా.. తన వైద్య వృత్తిలో ఎలాంటి తప్పుడు పనులు చేయలేదని తెలిపింది. కానీ ఇన్సూరెన్స్ సంస్థలు మాత్రం ఇలా చెప్పడంతో ఏది నిజమో? ఏది అబద్దమో? తెలియాల్సి ఉంది.