https://oktelugu.com/

పేపర్ కప్పులలో టీ తాగే వారికి షాకింగ్ న్యూస్..?

మనలో చాలామంది టీ తాగడం కోసం పేపర్ కప్పులను వినియోగిస్తూ ఉంటారు. ఫంక్షన్లలో, రైల్వే స్టేషన్లలో డిస్పోజబుల్ పేపర్ కప్పులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ పేపర్ కప్పులలో టీ తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచూ పేపర్ కప్పులలో తాగే వారికి ప్లాస్టిక్ శరీరంలో చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తాత్కాలికంగా శరీరంలో చేరిన ప్లాస్టిక్ వల్ల ఇబ్బందులు లేకపోయినా భవిష్యత్ లో మాత్రం ఆరోగ్య సమస్యలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 9, 2020 / 09:33 AM IST
    Follow us on


    మనలో చాలామంది టీ తాగడం కోసం పేపర్ కప్పులను వినియోగిస్తూ ఉంటారు. ఫంక్షన్లలో, రైల్వే స్టేషన్లలో డిస్పోజబుల్ పేపర్ కప్పులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ పేపర్ కప్పులలో టీ తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచూ పేపర్ కప్పులలో తాగే వారికి ప్లాస్టిక్ శరీరంలో చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తాత్కాలికంగా శరీరంలో చేరిన ప్లాస్టిక్ వల్ల ఇబ్బందులు లేకపోయినా భవిష్యత్ లో మాత్రం ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది.

    ఐఐటీ ఖరగ్ పూర్ కు చెందిన ప్రొఫెసర్లు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. వేడి కాఫీ లేదా టీ తాగితే డిస్పోజబుల్ కప్పులలోని ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి చేరతాయని.. మూడుసార్లు పేపర్ కప్పులలో టీ తాగే 75 వేల అతిసూక్ష్మ మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళతాయని తెలుపుతున్నారు. సాధారణంగా పేపర్ కప్పు హైడ్రో ఫోబిక్ ఫిల్మ్ పొరల అల్లికతో తయారు చేస్తారు.

    కొన్ని సందర్భాల్లో ఇతర పదార్థాలతో కూడా పేపర్ కప్పులు తయారవుతాయి. కాఫీ, టీలను వేడిగా ఉన్న సమయంలో పేపర్ కప్పులలో వేయడం వల్ల పేపర్ కప్పులపై ఉండే ప్లాస్టిక్ పొర టీ, కాఫీలలో సులభంగా కలిసిపోయి శరీరంలోకి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం తెచ్చేపెట్టే వ్యాధుల బారిన పడటానికి కూడా పేపర్ కప్పులు కారణమవుతాయని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే అనారోగ్య సమస్యల బారిన పడకుండా రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    వీలైనంత వరకు పేపర్ కప్పులలో టీ, కాఫీలు తాగడానికి దూరంగా ఉండాలని.. అలా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు. టీ లేదా కాఫీ తాగడానికి స్టీల్ లేదా గాజు గ్లాసులను వినియోగిస్తే మంచిది.