లోకేష్ కు అస్త్రంలా మారిన పోలవరం

ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం తగ్గట్టు ప్రతిపక్షం ఉంటేనే ఆ రాజకీయం వేరేలా ఉంటుంది. అక్కడి అభివృద్ధిలోనూ మార్పు కనిపిస్తుంటుంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్‌ చేసింది కూడా అదే. చంద్రబాబు చేసిన ఏ పనిని అయినా తప్పుబడుతూ ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లారు. ప్రజల మధ్య ఉండి నిలదీశారు. చివరగా సక్సెస్‌ అయ్యారు. ప్రజలు కూడా ఆయన మాటలు నమ్మి పదవిని కట్టబెట్టారు. చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమిని మూటగట్టుకున్నాడు చంద్రబాబు. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం […]

Written By: NARESH, Updated On : November 9, 2020 9:55 am
Follow us on

ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం తగ్గట్టు ప్రతిపక్షం ఉంటేనే ఆ రాజకీయం వేరేలా ఉంటుంది. అక్కడి అభివృద్ధిలోనూ మార్పు కనిపిస్తుంటుంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్‌ చేసింది కూడా అదే. చంద్రబాబు చేసిన ఏ పనిని అయినా తప్పుబడుతూ ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లారు. ప్రజల మధ్య ఉండి నిలదీశారు. చివరగా సక్సెస్‌ అయ్యారు. ప్రజలు కూడా ఆయన మాటలు నమ్మి పదవిని కట్టబెట్టారు. చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమిని మూటగట్టుకున్నాడు చంద్రబాబు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ప్రధానంగా రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయాక.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు జగన్‌. దీక్షలు, నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. కేంద్రంలోని బీజేపీకి చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టేశాడని ఆరోపించారు. ప్యాకేజీలకు కక్కుర్తి పడి సంజీవిని లాంటి హోదాను రాకుండా చేశారని చెప్పారు. యువభేరీలు, సదస్సులు అంటూ రాష్ట్రమంతటా తిరిగి చంద్రబాబుని బాగానే బదనాం చేశారు. యువకులకు ఉద్యోగాలు లేకుండా చేసి చంద్రబాబు తన అధికారాన్ని కాపాడుకుంటున్నారని కూడా జగన్ ఆ నాడు అన్నారు.

Also Read: వైరల్: వైసీపీ ఎమ్మెల్యే ఆడియో టేప్ లీక్ కలకలం

అధికారం చేపట్టిన వైసీపీకి ఇప్పుడు పోలవరం శాపంలా మారింది. పోలవరం నుంచి అటు ముందుకు వెళ్లలేక.. ఇటు వెనక్కి తప్పుకోలేక ఏపీ ప్రభుత్వాన్ని ఇరికించారు ప్రధాని మోడీ. ‘మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. 20 వేల కోట్లకు ఎక్కువ ఒక్క పైసా ఇచ్చేది లేదంటూ’ పెద్ద బాంబు పేల్చారు. దీంతో జగన్ సర్కార్ నెత్తిన ఏకంగా 30 వేల కోట్ల పెను భారం పడింది. అసలే అంతంత మాత్రాన ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితికితోడు ఇప్పుడు పోలవరం పుండు మీద కారం చల్లినట్లుగా మారింది.అయితే.. ఇప్పుడు ఇదే ఆయుధాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రెడీ అయిపోయిందట తెలుగుదేశం పార్టీ.

Also Read: చంద్రబాబుకు మరో షాక్.. టీడీపీకి మాజీ మంత్రి గుడ్ బై

ఇక ఈ మధ్య రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల మధ్య కనిపిస్తున్న చినబాబు నారా లోకేష్ పూర్తిగా జగన్‌ను టార్గెట్‌ చేశాడు. అందులో భాగంగా పోలవరం అంశాన్ని అస్త్రంగా ఎంచుకొని అటాక్‌ చేస్తున్నాడు. జగన్ తనకున్న కేసులను మాఫీ చేయించుకోవడానికి పోలవరాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టేశాడని లోకేష్ గట్టిగానే గర్జిస్తున్నాడు. 22 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్ ఇప్పుడు తన తల వంచుతున్నాడని హాట్ కామెంట్స్ చేస్తున్నాడు. పోలవరం ఏపీ ప్రజల జీవనాడి అని, ప్రజల ఆశలను వైసీపీ పెద్దలు చిదిమేశారని కూడా విమర్శిస్తున్నాడు. అంటే నాడు జగన్ కి హోదా సంజీవినిగా కనిపిస్తే ఇప్పుడు లోకేష్ బాబుకు పోలవరం జీవనాడిగాగా మారిందనేది స్పష్టంగా అర్థమవుతోంది.