టెంపర్ ట్రంప్.. వైట్ హౌస్ ఖాళీ చేసి పరార్!

డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ఈ రాత్రితో అమెరికా అధ్యక్షుడిగా దిగిపోతున్నాడు. అయినా కూడా గద్దెదిగకుండా తన అనుచరులు , మద్దతుదారులతో కొత్త అధ్యక్షుడు జోబైడెన్ ప్రమాణ స్వీకారానికి ఎసరు పెడుతున్నాడు. ఎఫ్.బీ.ఐ అత్యంత భద్రత మధ్య.. అల్లకల్లోల మధ్యనే కొత్త అధ్యక్షుడి ప్రమాణం జరగబోతోంది. Also Read: బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం స్పీచ్‌ డ్రాఫ్ట్‌ చేసింది తెలంగాణ కుర్రాడే.. మొదటి నుంచి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. తాను జోబైడెన్ ను అధ్యక్షుడిగా అంగీకరించనని ట్రంప్ మొండికేస్తున్నాడు. వైట్ […]

Written By: NARESH, Updated On : January 21, 2021 7:47 pm
Follow us on

డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ఈ రాత్రితో అమెరికా అధ్యక్షుడిగా దిగిపోతున్నాడు. అయినా కూడా గద్దెదిగకుండా తన అనుచరులు , మద్దతుదారులతో కొత్త అధ్యక్షుడు జోబైడెన్ ప్రమాణ స్వీకారానికి ఎసరు పెడుతున్నాడు. ఎఫ్.బీ.ఐ అత్యంత భద్రత మధ్య.. అల్లకల్లోల మధ్యనే కొత్త అధ్యక్షుడి ప్రమాణం జరగబోతోంది.

Also Read: బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం స్పీచ్‌ డ్రాఫ్ట్‌ చేసింది తెలంగాణ కుర్రాడే..

మొదటి నుంచి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. తాను జోబైడెన్ ను అధ్యక్షుడిగా అంగీకరించనని ట్రంప్ మొండికేస్తున్నాడు. వైట్ హౌస్ ఖాళీ చేయనంటూ భీష్మించుకు కూర్చున్నాడు. అయితే ఈ రాత్రి 10.30 గంటలకు జోబైడెన్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

జోబైడెన్ ప్రమాణ స్వీకారానికి కొద్దిగంటల ముందు.. తాజాగా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ను ఖాళీ చేశారు. ఫ్లోరిడాలోని తన ఇంటికి ట్రంప్ దంపతులు బయలుదేరారు. బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందే ట్రంప్ వైట్ హౌస్ ను ఖాళీ చేయడం గమనార్హం.

Also Read: బిగ్‌ డే..: ఇక జో బైడెన్‌ శకం

ట్రంప్ ఇప్పటికే జోబైడెన్ ను అంగీకరించనని.. వైట్ హౌస్ ను ఖాళీ చేయనంటూ భీష్మించుకు కూర్చున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ సడెన్ గా వైట్ హౌస్ ను ఖాళీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

జోబైడెన్ అమెరికా పార్లమెంట్ అయిన క్యాపిటల్ హిల్ భవన వేదిక నుంచి పదవీ ప్రమాణం చేస్తారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ఆయన కంటే ముందుగానే ప్రమాణం చేస్తారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు