https://oktelugu.com/

ముక్కోటి ఏకాదశి రోజు ఆ విష్ణు భగవానుని ఎందుకు పూజిస్తారో తెలుసా?

తెలుగు మాసాలలో కెల్లా మార్గశిరమాసం శ్రీమన్నారాయణకి ఎంతో పవిత్రమైనదని చెప్పవచ్చు.ఈ మార్గశిర మాసం మధ్యలో ధనుర్మాసం మొదలవడంతో ఈ నెలలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజు స్వామివారికి పెద్ద ఎత్తున పూజలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు ఉంటే అవన్నీ ఎంతో పవిత్రమైనవి ఈ ఏకాదశలన్ని చంద్రమానం ప్రకారం లెక్కిస్తే,ఈ ముక్కోటి ఏకాదశి మాత్రం సౌరమానం ప్రకారం లెక్కిస్తారు. ఈ సౌర మానంలో సూర్యుడు ఉత్తరాయణనికి ప్రవేశిస్తాడు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 24, 2020 12:41 pm
    Follow us on

    Mukkoti Ekadashi

    తెలుగు మాసాలలో కెల్లా మార్గశిరమాసం శ్రీమన్నారాయణకి ఎంతో పవిత్రమైనదని చెప్పవచ్చు.ఈ మార్గశిర మాసం మధ్యలో ధనుర్మాసం మొదలవడంతో ఈ నెలలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజు స్వామివారికి పెద్ద ఎత్తున పూజలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు ఉంటే అవన్నీ ఎంతో పవిత్రమైనవి ఈ ఏకాదశలన్ని చంద్రమానం ప్రకారం లెక్కిస్తే,ఈ ముక్కోటి ఏకాదశి మాత్రం సౌరమానం ప్రకారం లెక్కిస్తారు. ఈ సౌర మానంలో సూర్యుడు ఉత్తరాయణనికి ప్రవేశిస్తాడు.

    Also Read: కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం జరుగుతుంది!

    ఈ విధంగా సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి ప్రవేశించే ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠ ద్వారాలు తెరవటం వల్ల ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున సముద్రంలో పవళించిన విష్ణుదేవుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. ఆవిధంగా మేల్కొన్న ఆ విష్ణుమూర్తిని కలవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకుంటారు.

    Also Read: మంగళవారం చేయకూడని పనులు ఏమిటో తెలుసా?

    ఆ విధంగా ముక్కోటి దేవతలు వైకుంఠములో కొలువై ఉండటం వల్ల ఆ రోజు విష్ణు ఆలయాలను ఉత్తరద్వారం గుండా వెళ్లి ఆ విష్ణుమూర్తిని దర్శించుకోవడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని భావిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు.ఈ ఏకాదశి రోజు వైకుంఠానికి తలుపులు తెరచి ఉండడం వల్ల ఈ రోజు మరణించిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మన్నారాయణుని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకుంటారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం