కార్తీక మాసమంతా దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

దీపావళి పండుగను విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడుని లక్ష్మీదేవి చంపిన సందర్భంగా ప్రజలందరూ ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటారు. అలాగే రావణుడిని శ్రీరాముడు సంహరించి సతీ సమేతంగా అయోధ్యకు చేరుకున్న సందర్భంగా అయోధ్యలోని ప్రజలు దీపావళి పండుగను చేసుకున్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి. Also Read: ఐదు రోజుల దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా? కమ్ముకున్న చీకటిని పారద్రోలుతూ వెలుగులో తెచ్చే పండుగగా ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస అమావాస్య రోజున ఈ […]

Written By: Navya, Updated On : November 10, 2020 4:09 pm
Follow us on

దీపావళి పండుగను విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడుని లక్ష్మీదేవి చంపిన సందర్భంగా ప్రజలందరూ ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటారు. అలాగే రావణుడిని శ్రీరాముడు సంహరించి సతీ సమేతంగా అయోధ్యకు చేరుకున్న సందర్భంగా అయోధ్యలోని ప్రజలు దీపావళి పండుగను చేసుకున్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి.

Also Read: ఐదు రోజుల దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా?

కమ్ముకున్న చీకటిని పారద్రోలుతూ వెలుగులో తెచ్చే పండుగగా ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస అమావాస్య రోజున ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు. అమావాస్యకు ముందు రోజు అంటే ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజు నరకచతుర్దశిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నరకచతుర్దశి రోజు ఉదయం నువ్వుల నూనెతో స్నానం ఆచరించి నరకాసురుని బొమ్మ తయారు చేసే కాల్చి వేస్తారు.

దీపావళి రోజున సాయంత్రం దీపాల అలంకరణతో, లక్ష్మీ పూజ తో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఇక మహిళలైతే ఆశ్వయుజ మాసం అమావాస్య నుంచి కార్తీకమాసమంతా ప్రతిరోజు సాయంత్రం మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగిస్తారు. ప్రతిరోజు అలా వెలిగించిన దీపాలను కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ఆ దీపాలను పుణ్య నదులలో స్నానం ఆచరించి వాటిని ఆ నదుల్లో వదులుతారు. అలా చేయడం వల్ల ఆ స్త్రీలు పలు కాలాలపాటు నిండు సౌభాగ్యంతో ఉంటారని నమ్మకం.

Also Read: ఈ దీపం 24 గంటలు వెలుగుతుంది.. ఎలానో తెలుసా?

ఈ దీపావళి రోజున దీపాలలో నువ్వుల నూనెతో వెలిగించడం ద్వారా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. దీపావళికి ప్రత్యేకంగా లక్ష్మి పూజను చేయడానికి గల కారణం ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే నరకాసురుడిని వధించిన సందర్భంగా ప్రజలందరూ ఎంతో ఆనందంతో బాణసంచా కాలుస్తూ లక్ష్మీదేవి కి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అయితే ఆ పూజ నువ్వుల నూనెతో చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించే వారు కూడా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి.